Site icon HashtagU Telugu

Meta India Head: మెటా ఇండియా హెడ్ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా?

Meta India Head

Meta India Head

Meta India Head: ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ అయిన మెటా ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటి. ఈ టెక్ కంపెనీ ఇండియా హెడ్ (Meta India Head) సాఫ్ట్‌వేర్ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని భారతీయురాల‌ని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సంధ్య ప్రస్తుతం మెటా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు

సంధ్యా దేవనాథన్ ప్రస్తుతం మెటా వైస్ ప్రెసిడెంట్, మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్. ఆమె నవంబర్ 2022లో అజిత్ మోహన్ స్థానంలో మెటా ఇండియా అధిపతిగా నియ‌మితుల‌య్యారు. జనవరి 2023లో బాధ్యతలు స్వీకరించింది. ఆ సమయంలో సంధ్య మెటా గేమింగ్ ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహిస్తుంది.

Also Read: Jogulamba Temple Priest: జోగులాంబ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడిపై వేటు? కార‌ణ‌మిదే?

2016లో మెటాతో అనుబంధం

సంధ్యా దేవనాథన్ 2016లో మెటాలో చేరారు. ఆమె సింగపూర్‌లో మెటా గ్రూప్ డైరెక్టర్‌గా చేరింది. అక్కడ ఆమె ఆగ్నేయాసియా మార్కెట్‌లో మెటా ఇ-కామర్స్, ప్రయాణం, ఆర్థిక సేవలకు నాయకత్వం వహించే బాధ్యత వ‌హించింది. ఆమె సింగపూర్, వియత్నాంలో కంపెనీ వ్యాపారాన్ని నిర్మించడంలో సహాయం చేసింది. తర్వాత సింగపూర్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, వియత్నాంలో కంపెనీ బిజినెస్‌ హెడ్‌గా నియమితులయ్యారు. దీని తరువాత 2020 సంవత్సరంలో మెటా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో గేమింగ్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించడానికి ఆమె ఇండోనేషియాకు వెళ్లింది.

ఆంధ్ర, ఢిల్లీ విశ్వవిద్యాలయాల విద్యార్థి

సంధ్య ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసింది. ఆమె 1994 నుండి 1998 వరకు ఇక్కడ చదువుకుంది. దీని తరువాత 1998 నుండి 2000 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి MBA చేసింది. 2014లో ఆమె బిజినెస్ స్కూల్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నుండి లీడర్‌షిప్ కోర్సు చేసింది. ఇది ఆమె మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను బలోపేతం చేయడానికి సహాయపడింది.

మెటాలో చేరడానికి ముందు సంధ్య సుమారు 22 ఏళ్లపాటు వివిధ రంగాల్లో పనిచేసి అనుభవం సంపాదించుకుంది. బ్యాంకింగ్, చెల్లింపులు, సాంకేతిక రంగాలలో పనిచేసింది. ఆమె 2000 నుండి 2009 వరకు సిటీ గ్రూప్‌లో వివిధ పదవులను నిర్వహించి, ఆపై 2009 నుండి 2015 వరకు స్టాండర్డ్ చార్టర్డ్‌లో పనిచేశారు. ఉత్పత్తి ఆవిష్కరణ, భాగస్వామ్య నిర్మాణంలో సంధ్య నిపుణురాలిగా పేరొందారు. ఈ లక్షణాలను మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ తన స్టేట్‌మెంట్‌లో ఇండియా హెడ్‌గా నియమించడం గురించి తెలియజేసారు.