Marriage Scheme: మహిళలకు గుడ్‌ న్యూస్‌.. వారి ఖాతాల్లోకి రూ. 51 వేలు, అర్హులు వీరే..!

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 12:30 PM IST

Marriage Scheme: దేశంలోని పౌరుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందులో వివిధ వ్యక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలు తీసుకొచ్చారు. ఈ పథకాలు చాలా వరకు పేదలు, నిరుపేదల కోసం ఉన్నాయి. అలాంటి వారికి ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తుంది. ఆ కోవలోకి వచ్చేది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లేదా ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన. నిరుపేదలు ఈ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యక్ష ప్రయోజనాలను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రాల పౌరుల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో వివిధ రకాల పథకాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం ఏమిటో తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గ్రూప్ మ్యారేజ్ స్కీమ్ (Marriage Scheme) కింద పేద నిరుపేదలకు పెళ్లి కోసం ప్రభుత్వం మొత్తం రూ.51 వేలు అందజేస్తుంది. ఈ మొత్తం ఒకేసారి పూర్తిగా ఇవ్వరు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద వివాహానంతరం పథకానికి అర్హులైన పేద వధువుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.31 వేలు జమ చేస్తుంది. అనంతరం మిగిలిన డబ్బు పెళ్లికి ఉపయోగించే మిగిలిన వస్తువులకు రూ.10,000 ఖర్చు చేస్తారు. అలా మిగిలిన రూ.6వేలు పెళ్లి వేడుకలో అలంకరణలకు అయ్యే ఖర్చుకు ఇవ్వనున్నారు. ఈ పథకం ప్రయోజనం నిరుపేద కుమార్తెలకు మాత్రమే అందించబడుతుంది.

Also Read: Train Collides: మరో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి..!

పథకానికి ఎవరు అర్హులు?

ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి గ్రూప్‌ మ్యారేజ్‌ స్కీమ్‌ కింద పేద కుటుంబాల్లోని కుమార్తెల పెళ్లిళ్లకు మాత్రమే రూ.51 వేలు ఇస్తారు. వీరి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు అయి ఉండాలి. దీనితో పాటు ఈ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులైన కుటుంబం వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు. ఎవరైనా షెడ్యూల్డ్ కులం లేదా OBC కమ్యూనిటీకి చెందినవారైతే అప్పుడు పథకం ప్రయోజనాలను పొందేందుకు ఆ వ్యక్తులు వారి కుల ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద వధువు కనీస వయస్సు 18 సంవత్సరాలు, వరుడి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.

We’re now on WhatsApp : Click to Join

ఈ పథకం మధ్యప్రదేశ్‌లో కూడా అమలులో ఉంది

నిరుపేదలకు వివాహానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా మధ్యప్రదేశ్‌లో కూడా ఒక పథకం అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కళ్యాణి వివాహ సహాయ పథకం కింద వివాహానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.