Site icon HashtagU Telugu

Lucky : అదృష్టం అంటే ఇతడిదేపో.. రూ.లక్ష పెట్టి రూ.80 కోట్లు కొట్టేసాడు

Rs 1 Lakh To Rs 80 Crore

Rs 1 Lakh To Rs 80 Crore

ఒక కుటుంబానికి వచ్చిన అదృష్టం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 1990లో జిందాల్ సంస్థ(Jindal Company)లో ఓ వ్యక్తి రూ. లక్ష విలువైన షేర్లు (shares) కొనుగోలు చేశాడు. ఆ సమయంలో ఇది సాధారణ పెట్టుబడిగా భావించినా, సంవత్సరాల తరబడి వాటిని తీయకుండా ఆ త్రాలు అలానే ఉంచాడు. అనుకోకుండా తాజాగా ఆయన కొడుకు ఆ షేరు పత్రాలను చూసి వాటి విలువను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ షేర్ల ప్రస్తుత విలువ తెలుసుకున్న కొడుకు షాక్ కు గురయ్యాడు.

Dry Fish : ఎండు చేపలు తింటే ఎన్ని “ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

అప్పట్లో పెట్టిన రూ. లక్ష ఇప్పుడు ఏకంగా రూ. 80 కోట్లకు చేరిందని తేలింది. ఈ విషయాన్నీ సౌరవ్ దత్తా అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ‘ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వలెనే పని చేస్తుంది. కాలంతో పాటు విలువ పెరగడం సహజం’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కేవలం అదృష్టం మాత్రమే కాక, పెట్టుబడులపై ఉన్న అవగాహన, ఓర్పుతో పాటు భవిష్యత్తు కోసం పెట్టిన మంచి ప్రణాళికను సూచిస్తుంది. ఈ సంఘటన ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రజల్లో ఉన్న అవగాహన పెరగడానికి మంచి ఉదాహరణగా నిలిచింది. కాలంతో పాటు మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంతటి ప్రయోజనం పొందవచ్చో ఈ ఘటన ద్వారా తెలుస్తోంది.