Madhabi Puri- Dhaval Buch: అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక మరోసారి భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నివేదికలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్ (Madhabi Puri- Dhaval Buch) గురించి ఓ విషయం వెల్లడించింది. అమెరికన్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో అదానీ మనీ సిఫనింగ్ స్కాంలో పాల్గొన్న విదేశీ కంపెనీలలో మాధవి పూరీకి, ఆమె భర్త ధవల్ బుచ్‌కి వాటాలు ఉన్నాయని ఆరోపించింది. జూన్ 5, 2015న సింగపూర్‌లోని IPC ప్లస్ ఫండ్ 1లో మాధబి, ధవల్ బుచ్ ఖాతా తెరిచారని నివేదిక తెలిపింది. విజిల్‌బ్లోయర్ పత్రాలు, స్కామ్‌పై పరిశోధనలను ఉటంకిస్తూ పేర్కొంది.
సెబీ చీఫ్ ఆరోపణలను తోసిపుచ్చారు
మీడియా నివేదికల ప్రకారం IAFL పెట్టుబడికి మూలం జీతం. మాధబి-ధావల్ మొత్తం సంపద ప్రస్తుతం $10 మిలియన్ (రూ. 83 కోట్లు) కంటే ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా సెబీ చైర్‌పర్సన్ మధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి పారదర్శకంగా ఉందని చెప్పారు. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో వాస్తవం లేదు. తమ ఆర్థిక రికార్డులను పబ్లిక్‌గా ఉంచుతామని సెబీ చీఫ్ పేర్కొన్నారు. తద్వారా నిజం బయటకు వస్తుందని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం తమ ఆస్తి వివరాలను సెబీ కార్యాలయానికి సమర్పించినట్లు మాధబి మీడియాకు తెలిపారు.
Also Read: MS Dhoni: ధోనీపై ఫిర్యాదు.. ఆగస్టు 30లోగా సమాధానం చెప్పాలని కోరిన బీసీసీఐ..!
మాధబి పూరీ బుచ్- ధవల్ బుచ్ ఎవరు?
మార్చి 2, 2022న సెబీ చైర్మన్‌గా మాధబి పూరి బుచ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఆమె సెబీ సభ్యురాలు. మార్కెట్ నియంత్రణ, పెట్టుబడి నిర్వహణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పనులను ఆమె చూసుకున్నారు. మాధబి చైనాలోని షాంఘైలోని న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు సలహాదారుగా, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ సింగపూర్ కార్యాలయానికి చీఫ్‌గా పనిచేశారు. మాధవి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మాధబి ఐఐఎం అహ్మదాబాద్‌లో MBA, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి మ్యాథ్స్ కోర్సు చేశారు.
ధవల్ బుచ్ బ్లాక్‌స్టోన్, అల్వారెజ్ & మార్షల్ కంపెనీలో సీనియర్ సలహాదారు. అతను గిల్డాన్ బోర్డు సభ్యుడు కూడా. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ) నుంచి కోర్సు చేశారు. 1984లో మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. యూనిలీవర్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.