ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

పిఎన్‌జి కస్టమర్లు తమ ఎల్‌పిజి కనెక్షన్‌ను తప్పనిసరిగా సరెండర్ చేయాల్సి ఉంటుందని లేదా దానిని 'ఇన్‌యాక్టివ్' మోడ్‌లోకి మార్చాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
LPG Cylinder

LPG Cylinder

LPG Cylinder: పెట్రోలియం మంత్రిత్వ శాఖ వినియోగదారుల కోసం ఎల్‌పిజి (LPG) సిలిండర్లపై పూర్తి నిషేధాన్ని విధించింది. సంబంధిత వినియోగదారులు ఇకపై కొత్త సిలిండర్ తీసుకోలేరు. పాత దానిని రీఫిల్ చేయించుకోలేరు. ఈ కొత్త నిబంధన ఎవరికి వర్తిస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

ఎల్‌పిజి సిలిండర్ కనెక్షన్ – కొత్త నిబంధన

భారతీయ వంటగది గ్యాస్ ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు మధ్యతరగతి కుటుంబాలు పిఎన్‌జి (PNG – పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్‌తో పాటు బ్యాకప్ కోసం ఒక ఎల్‌పిజి సిలిండర్‌ను కూడా ఉంచుకునే అలవాటు కలిగి ఉన్నారు. అయితే పెట్రోలియం మంత్రిత్వ శాఖ చేసిన తాజా సవరణ ఈ పద్ధతికి స్వస్తి పలికింది. పిఎన్‌జి కనెక్షన్ ఉన్నవారిలో ఎవరికి ఎల్‌పిజి సౌకర్యం ఉంటుంది. ఎవరికి ఉండదు అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఎవరికి ఎల్‌పిజి సిలిండర్ లభించదు?

మీడియా నివేదికల ప్రకారం.. కొత్త ఆదేశాల తర్వాత ప్రభుత్వ చమురు కంపెనీలు (IOCL, BPCL, HPCL) ఇప్పటికే పైప్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులను గుర్తిస్తాయి. అటువంటి వినియోగదారులు కొత్త కనెక్షన్ తీసుకోవడంపై నిషేధం ఉండటమే కాకుండా వారు తమ పాత సిలిండర్లను రీఫిల్ కూడా చేయించుకోలేరు. ‘డేటా షేరింగ్’ ద్వారా ఇలాంటి వినియోగదారులను ట్రాక్ చేస్తారు. ఏ ఇంట్లో అయితే పిఎన్‌జి కనెక్షన్ యాక్టివ్‌గా ఉందో, అక్కడ ఇకపై ఎల్‌పిజి సిలిండర్ సౌకర్యం కల్పించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!

ప్రభుత్వ ఈ కఠిన నిర్ణయం వెనుక 3 ప్రధాన ఉద్దేశ్యాలు

వనరుల సమాన పంపిణీ: పట్టణ ప్రాంతాల్లో ఎల్‌పిజి వినియోగాన్ని తగ్గించి, ఆ సిలిండర్లను పైప్‌లైన్ వేయడం సాధ్యం కాని గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు పంపడమే ప్రభుత్వ లక్ష్యం.

సబ్సిడీ భారాన్ని తగ్గించడం: ఎల్‌పిజిపై ఇచ్చే భారీ సబ్సిడీ ప్రభుత్వంపై పెద్ద ఆర్థిక భారం. పిఎన్‌జి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దీనిని నిలిపివేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఊరట లభిస్తుంది.

భద్రత- పర్యావరణం: ఎల్‌పిజితో పోలిస్తే పిఎన్‌జి మరింత సురక్షితమైనది. కాలుష్య రహితమైనదిగా పరిగణించబడుతుంది. పైపుల ద్వారా నిరంతరం సరఫరా జరగడం వల్ల రీఫిల్లింగ్ చేసే ఇబ్బంది కూడా తప్పుతుంది.

సామాన్య ప్రజలపై పడే ప్రభావం ఏమిటి?

పిఎన్‌జి సరఫరాలో సాంకేతిక లోపాలు లేదా మెయింటెనెన్స్ జరిగినప్పుడు బ్యాకప్ కోసం సిలిండర్ వాడే కుటుంబాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది. సరఫరా నిలిచిపోయిన సందర్భంలో ప్రత్యామ్నాయ ఇంధనం లేక వినియోగదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

పిఎన్‌జి కస్టమర్లు తమ ఎల్‌పిజి కనెక్షన్‌ను ఎప్పుడు మూసివేయాలి?

పిఎన్‌జి కస్టమర్లు తమ ఎల్‌పిజి కనెక్షన్‌ను తప్పనిసరిగా సరెండర్ చేయాల్సి ఉంటుందని లేదా దానిని ‘ఇన్‌యాక్టివ్’ మోడ్‌లోకి మార్చాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వనరుల సరైన నిర్వహణ దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య భవిష్యత్తులో గ్యాస్ పంపిణీ వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తుందని భావిస్తున్నారు.

  Last Updated: 15 Mar 2026, 12:35 PM IST