LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగం మనదేశంలో వేగంగా విస్తరిస్తోంది. నెలవారీ ఆదాయం ఉన్నవారిలో చాలామంది ఆరోగ్య బీమా పాలసీ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వైద్యఖర్చులు బాగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం అనేది తప్పనిసరి అంశంగా మారింది. మార్కెట్లో ఏర్పడిన ఈ ట్రెండ్‌ను భారత ప్రభుత్వానికి చెందిన జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) ఎప్పుడో గుర్తించింది. త్వరలోనే ఆరోగ్య బీమా పాలసీలను కూడా ఎల్‌ఐసీ అందించనుంది. విస్తారమైన ఎల్‌ఐసీ నెట్‌వర్క్‌ను వాడుకొని దేశ ప్రజలంతా ఆరోగ్య బీమా పాలసీలను చౌక ధరలకే తీసుకోవచ్చు.
Also Read :Salman Vs Lawrence: లారెన్స్ హత్య బెదిరింపులు.. ఫస్ట్ టైం సల్లూ భాయ్ రియాక్షన్
ఎల్‌ఐసీ కీలక ముందడుగు..
ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయిన ఎల్‌ఐసీ త్వరలోనే కీలక ముందడుగు వేయబోతోంది. ఈక్రమంలో మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ (ManipalCigna Health Insurance) కంపెనీలో దాదాపు 49 శాతం వాటాను కొనే అవకాశం ఉంది. ఎల్‌ఐసీ, మణిపాల్‌సిగ్నా మధ్య జరగనున్న ఈ డీల్ విలువ దాదాపు రూ.3,500-3,750 కోట్లుగా ఉంటుందని అంచనా. బెంగళూరు కేంద్రంగా నడిచే మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG), అమెరికాకు చెందిన సిగ్నా కార్పొరేషన్ కలిసి మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఈ కంపెనీలో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్‌కు 51 శాతం వాటా ఉంది. అమెరికాకు చెందిన సిగ్నా గ్రూపునకు(LIC Health Insurance) 49 శాతం వాటా ఉంది.
Also Read :Indian Auto Companies : ట్రంప్ 25 శాతం ఆటోమొబైల్ పన్ను.. ఏయే భారత కంపెనీలపై ఎఫెక్ట్ ?
మార్చి 31లోగా కీలక ప్రకటన
వ్యాపార సమీకరణాలు, వాటాల కొనుగోలు వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోని 49 శాతం వాటాను ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ కొనబోతోంది. భవిష్యత్తులో ఈ రెండు కంపెనీలతో ఎల్‌ఐసీ కలిసి పనిచేయనుంది. మణిపాల్ సిగ్నాలో వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. మార్చి 31లోగా ఈ డీల్‌పై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది.