Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

కేవలం కుమారీ ఆంటీ మాత్రమే కాకుండా, హైదరాబాద్‌లోని అనేక చిన్న తరహా హోటళ్లు, ఫుడ్ కోర్టులు ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మూతపడే దిశగా ఉన్నాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే సామాన్య వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని

Published By: HashtagU Telugu Desk
Kumari Aunty Business

Kumari Aunty Business

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఎంతో ఫేమస్ అయిన ‘కుమారీ ఆంటీ’ హోటల్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నగరవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరత ప్రభావం నేరుగా ఆమె వ్యాపారంపై పడింది. గతంలో రకరకాల కూరలు, వెరైటీ వంటకాలతో కస్టమర్లను అలరించిన కుమారీ ఆంటీ, ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల ఎక్కువ రకాల వంటలు వండలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల నిత్యం కిటకిటలాడే ఆమె ఫుడ్ స్టాల్ వద్ద ఇప్పుడు బిజినెస్ చాలా డల్‌గా సాగుతోందని, కస్టమర్లకు అడిగినవి వడ్డించలేకపోతున్నామని ఆమె పేర్కొన్నారు.

నగరంలో కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, రూ. 8,000 పెట్టినా ఒక్క సిలిండర్ దొరకడం లేదని కుమారీ ఆంటీ వాపోయారు. గ్యాస్ దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిపై వంట చేద్దామని ప్రయత్నించినా, దానికి ఇంటి యజమాని అంగీకరించడం లేదని ఆమె తెలిపారు. పొగ వల్ల ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలుగుతుందనే కారణంతో కట్టెల పొయ్యిని అనుమతించడం లేదని, దీంతో దిక్కుతోచని స్థితిలో చిన్న గ్యాస్ బండను ఏకంగా రూ. 6,000 వెచ్చించి కొనుగోలు చేసి, ప్రస్తుతం ఎలాగోలా నెట్టుకొస్తున్నామని తన కష్టాలను వివరించారు.

కేవలం కుమారీ ఆంటీ మాత్రమే కాకుండా, హైదరాబాద్‌లోని అనేక చిన్న తరహా హోటళ్లు, ఫుడ్ కోర్టులు ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మూతపడే దిశగా ఉన్నాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే సామాన్య వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె కోరారు. ఐటీ ఉద్యోగులకు పెట్టినట్లుగానే, వీధి వ్యాపారులకు కూడా గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని, లేదంటే గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోయి తమలాంటి వారు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

  Last Updated: 12 Mar 2026, 07:49 PM IST