Site icon HashtagU Telugu

JioStar Live : ‘జియో స్టార్’.. జియో సినిమా, హాట్‌స్టార్​‌ల కొత్త డొమైన్ ఇదేనా ?

Jiostar Live Disney Star Reliance Industries

JioStar Live : ‘జియోస్టార్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతానికి  అందులో ‘కమింగ్ సూన్’ అని మాత్రమే రాసి ఉంది. ముకేశ్ అంబానీకి చెందిన జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ విలీనం ప్రక్రియ ఇవాళే పూర్తవుతుందనే టాక్ వినిపిస్తోంది. నవంబర్‌ 14 నుంచి ‘జియోస్టార్‌’ డొమైన్‌ అందుబాటులోకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

రాబోతున్న పోర్టల్ ఇదేనా ?

జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌ కంపెనీల విలీనంతో ‘జియో హాట్‌స్టార్‌’ అనే కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. అయితే ఆ డొమైన్ ప్రస్తుతం దుబాయ్‌కు చెందిన ఓ ఫ్యామిలీ చేతిలో ఉంది. డొమైన్ కొనుగోలు విషయమై వాళ్లతో జియో కంపెనీకి డీల్ కుదిరిందా  ? లేదా ? అనే దానిపై ఎవ్వరికీ పూర్తి క్లారిటీ లేదు. ఈ తరుణంలో జియోస్టార్ పేరు కలిగిన ఒక డొమైన్‌పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. జియో హాట్‌స్టార్‌కు బదులుగా అందుబాటులోకి రాబోతున్న డొమైన్ అదేనని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో డిస్నీ హాట్ స్టార్(JioStar Live), జియో సినిమాల కలయికతో రాబోతున్న పోర్టల్ ఏది ? అనే దానిపై సినీ ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read :BSNL Direct to Device : బీఎస్ఎన్ఎల్ ‘డైరెక్ట్ టు డివైజ్’ సర్వీసులు షురూ.. ఫైబర్‌ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానళ్లు

తొలుత జియో హాట్‌స్టార్ డొమైన్ ఢిల్లీకి చెందిన ఒక యాప్ డెవలప్ చేతిలో ఉండేది. అతడు తన ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును భరిస్తే డొమైన్‌ను జియోకు ఇచ్చేస్తానని ప్రకటించాడు. అయితే జియో స్పందించలేదు. ఇదే అదునుగా దుబాయ్‌కు చెందిన ఒక ఫ్యామిలీ సదరు ఢిల్లీ యువకుడిని సంప్రదించి జియో హాట్‌స్టార్ డొమైన్‌ను కొనేసింది. ఇందుకోసం ఆ యువకుడికి ఎంత అమౌంట్ ఇచ్చింది ? అనే విషయం ఎవరికీ తెలియదు. ఇటీవలే దుబాయ్‌లోని సదరు కుటుంబం.. జియోకు ఫ్రీగా జియో హాట్‌స్టార్ డొమైన్‌ను ఇస్తామని ప్రకటించింది. ఆసక్తి ఉంటే జియో కంపెనీ ప్రతినిధులు తమను సంప్రదించవచ్చని తెలిపారు. డబ్బులు లేకుండా ఫ్రీగా పోర్టల్‌ను ఎందుకు ఇస్తున్నారు ? కారణం ఏమిటి? అకస్మాత్తుగా వారి ఆలోచన ఎలా మారింది? అనే దానిపై నెటిజన్ల నడుమ డిస్కషన్ నడుస్తోంది.

Also Read :Ajit Pawar : అజిత్ పవార్‌‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు.. శరద్ పవార్ ఫొటోలు వాడటంపై ఆగ్రహం