జియో సినిమా మరియు డిస్నీ+ హాట్‌స్టార్ సేవలు (Jiohotstar launch) ఇప్పుడు ఒకే సంస్థగా మారాయి. ఈ విలీనంతో జియో హాట్‌స్టార్ పేరుతో కొత్త సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసులు కలిపి ఒక పెద్ద యూజర్ బేస్‌ను సృష్టించాయి. రాబోయే కాలంలో ఈ సేవలు మరింత ప్రజాదరణ పొందుతాయి అని అంచనా వేయవచ్చు. గతంలో జియో సినిమా మరియు హాట్‌స్టార్ కోసం వేర్వేరు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఉండేవి, అయితే ఇప్పుడు ఈ రెండు సేవలు ఒకే ప్లాన్‌లో కలవడం ద్వారా యూజర్లు మరింత సౌకర్యంగా కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.
జియో హాట్‌స్టార్ సేవలు మరియు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు
జియో హాట్‌స్టార్ సేవలు రూ.149 నుండి ప్రారంభమవుతాయి. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మొబైల్ ప్లాన్‌గా పిలువబడతుంది. ఇది మూడు నెలల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. అలాగే, ఏడాది పాటు సేవలు పొందాలనుకుంటే రూ.499లో ఈ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్లలో కంటెంట్ యాడ్స్‌తో ఉంటుంది. అలాగే ఒక్క మొబైల్‌లో మాత్రమే వీటి సేవలను చూడవచ్చు.
రెండు డివైజ్‌లలో స్ట్రీమింగ్ :
జియో హాట్‌స్టార్ ద్వారా మరిన్ని ప్లాన్లను ప్రకటించారు. 3 నెలల వ్యాలిడిటీతో రూ.299 ప్లాన్, 1 సంవత్సరానికి రూ.899 ప్లాన్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లను ఎంచుకున్న వినియోగదారులు రెండు డివైజ్‌లలో కంటెంట్‌ను వీక్షించవచ్చు. మొబైల్, డెస్క్‌టాప్ లేదా టీవీ వంటి రెండు డివైజ్‌లలో స్ట్రీమింగ్ చేయడం వీలు పడుతుంది. ఈ ప్లాన్లు యాడ్స్‌తో కూడి ఉంటాయి.
ప్రీమియం ప్లాన్లు: యాడ్-ఫ్రీ ఎంటర్టైన్మెంట్
జియో హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్లు యాడ్స్ లేకుండా కంటెంట్‌ను చూడాలనుకునే వారికి అనుకూలంగా ఉన్నాయి. రూ.299తో నెలపాటు యాడ్స్ లేకుండా కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. 3 నెలల పథకం కోసం రూ.499, ఏడాది సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.1499 పెరిగినట్లు ప్రకటించారు. ఈ ప్రీమియం ప్లాన్లు 4 డివైజ్‌లలో స్ట్రీమింగ్ చేయడం సాధ్యం చేస్తాయి. ఇక జియో హాట్‌స్టార్ విలీనం తరువాత భారతదేశంలో అత్యధిక యూజర్ బేస్ ఉన్న స్ట్రీమింగ్ సర్వీస్‌గా నిలుస్తోంది. వినియోగదారులు తమకి అనుకూలమైన ప్లాన్ ఎంచుకుని, అవి అందించే అనేక వినోదాలను ఎంజాయ్ చేసుకోవచ్చు.