Site icon HashtagU Telugu

Jio Hotstar : ‘జియో హాట్‌స్టార్’ డొమైన్ వ్యవహారం.. తెరపైకి ఇద్దరు పిల్లలు

Jio Hotstar Domain Dubai Girls App Developer Missing

Jio Hotstar : ‘జియో హాట్‌స్టార్‌’  డొమైన్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆ డొమైన్‌ను తన పేరిట రిజిస్టర్‌ చేసుకున్న ఢిల్లీకి చెందిన ఓ యాప్‌ డెవలపర్‌ అకస్మాత్తుగా మిస్సయ్యాడు. బ్రిటన్‌లోని  కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో డిగ్రీ  చేసేందుకు తనకు రూ.కోటి ఇస్తే.. డొమైన్‌ను రిలయన్స్‌కు ఇచ్చేస్తానని డిమాండ్ చేసిన ఆ యువకుడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియడం లేదు.

Also Read :Union Bank Of India : తెలంగాణ, ఏపీలలో చెరో 200 బ్యాంక్ జాబ్స్

ఆ యువకుడి స్థానంలో యూఏఈకి చెందిన ఇద్దరు మైనర్ అన్నాచెల్లెళ్లు(Jio Hotstar) ఇప్పుడు రంగంలోకి వచ్చారు. వారిద్దరూ ‘జియో హాట్‌స్టార్‌’  డొమైన్‌‌లో తమ గురించి రాసుకొచ్చారు. దాని ప్రకారం.. ఆ ఇద్దరు పిల్లల పేర్లు జైనం, జీవిక.  వారు ఒక పెద్ద పోస్టుతోపాటు పలు వీడియోలు, ఫొటోలను ఆ వెబ్‌సైటులో పోస్ట్‌ చేశారు. తాము తోటి పిల్లలకు సాంకేతిక అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు జైనం, జీవిక తెలిపారు. ఆట వస్తువుల అన్‌ బాక్సింగ్‌తో తమ టెక్ నాలెడ్జ్ ప్రయాణం మొదలైందన్నారు. ఢిల్లీకి చెందిన టెకీ నుంచి ఈ పిల్లల పేరు మీద ఎవరైనా ఇతర వ్యక్తులు డొమైన్‌ను కొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రిలయన్స్‌ జియో హాట్‌స్టార్‌ డొమైన్‌ కాకుండా వేరే ఏదైైనా పేరు కోసం జియో ట్రై చేస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

Also Read :Indian Immigrants : ఆ భారతీయులను వెనక్కి పంపిన అమెరికా

ఇటీవలే రిలయన్స్, వాల్ట్‌ డిస్నీ భారత వ్యాపారాల విలీనం జరిగింది. దీంతో జియోహాట్‌స్టార్‌ డొమైన్‌ను లైవ్‌లోకి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఢిల్లీకి చెందిన ఓ యాప్‌ డెవలపర్‌ వెంటనే ఆ డొమైన్‌ను కొనేశాడు. అనంతరం దాన్ని అమ్మకానికి పెట్టాడు. రిలయన్స్ కంపెనీ తన డిమాండును నెరవేరిస్తే డొమైన్‌ను తిరిగి ఇచ్చేస్తానని అతడు వెల్లడించాడు. దీనిపై రిలయన్స్ నేరుగా స్పందించలేదు.

Also Read :YS Jagan : జగన్‌ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల