Jio recharge Plans : రిలయన్స్ జియో భారతీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. సరసమైన ధరలకే 4జీ, 5జీ సేవలను అందిస్తూ, కోట్లాదిమంది వినియోగదారులకు ఇంటర్నెట్‌ను చేరువ చేసింది. జియోకు చెందిన 4జీ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించి, స్థిరమైన, నమ్మకమైన కనెక్టివిటీని అందిస్తుంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ వేగం తక్కువగా ఉండవచ్చు. ఇక 5జీ విషయానికొస్తే, జియో ట్రూ 5జీ సేవలు ఇప్పుడు చాలా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇది అల్ట్రా-ఫాస్ట్ స్పీడ్‌ను అందిస్తుంది. దీనితో డౌన్‌లోడ్‌లు, స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటివి ఎలాంటి అంతరాయం లేకుండా చేయొచ్చు.
తక్కువ ధర గల జియో మంత్లీ ప్లాన్‌లు
జియో తక్కువ ధరలోనే చాలా రకాల ప్లాన్‌లను అందిస్తుంది. మీరు కాల్స్, డేటా రెండూ కావాలనుకుంటే, నెలకు రూ. 209 ప్లాన్ బాగుంటుంది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దీనితో పాటు, జియో రూ. 239 ప్లాన్ కూడా ఉంది. దీనిలో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అయితే, ఇది 4జీ, 5జీ నెట్వర్క్ సేవల్లో ధరలు మారుతూ ఉంటాయనేది గుర్తించాలి.
తక్కువ ధర గల డేటా ప్లాన్‌లు
మీకు ఎక్కువ డేటా అవసరం ఉంటే, డేటా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. మీకు కొద్ది రోజుల కోసం మాత్రమే డేటా కావాలంటే రూ. 19 ప్లాన్లో 1.5 జీబీ డేటా, రూ. 29 ప్లాన్లో 2.5 జీబీ డేటా వస్తుంది. దీనిలో పాత ప్లాన్ వ్యాలిడిటీనే కొనసాగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు ఉపయోగించాలంటే, రూ. 181 ప్లాన్లో 30 జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే, కొందరు రెండు సిమ్స్ వాడే వారు ఒకదానికి కాల్స్, మరోదానికి నెట్ పర్పస్ వాడాలనుకునేవారికి ఈ జియో డేటా ప్యాక్స్ఎంతగానో ఉపయోగపడతాయి.
తక్కువ ధర గల SMS ప్లాన్‌లు
మీరు ఎక్కువగా కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు మాత్రమే ఉపయోగిస్తుంటే, ఎస్‌ఎంఎస్ ప్యాక్‌ల కోసం చూస్తుంటారు. చాలామందికి ఎస్‌ఎంఎస్‌లు, బ్యాంకింగ్ అప్‌డేట్స్ వంటి వాటికి అవసరం అవుతాయి. ఇలాంటి వారికి రూ. 15 ప్లాన్ ఉంది. దీనిలో 28 రోజులకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే, ఇప్పుడు చాలా రీఛార్జ్ ప్లాన్‌లలో అపరిమిత కాలింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉన్నాయి.
4జీ, 5జీ సేవలపై ఆఫర్లు
జియో 4జీ వినియోగదారుల కోసం తక్కువ ధరకే ప్లాన్‌లను అందిస్తుంది. మీరు 5జీ ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే, రూ. 239 ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే, మీకు ఉచితంగా 5జీ డేటా వస్తుంది. దీనితో మీరు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అపరిమిత 5జీ ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు.
Jio Mart : మహిళలకు శుభవార్త.. బంపరాఫర్స్ ప్రకటించిన జియో మార్ట్