Site icon HashtagU Telugu

Jeff Bezos: వివాహం త‌ర్వాత పైజామా పార్టీ.. అతిథుల‌కు ప్ర‌త్యేక బ‌హుమ‌తి!

Jeff Bezos

Jeff Bezos

Jeff Bezos: ప్రపంచంలోని మూడవ అత్యంత ధనవంతుడైన వ్యక్తి, అమెజాన్ CEO జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరోసారి వార్తల్లో నిలిచారు. 230 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తులు ఉన్న జెఫ్ బెజోస్ 2025 జూన్ 27న వెనిస్‌లో తన దీర్ఘకాల స్నేహితురాలు లారెన్ సాంచెజ్‌ను వివాహం చేసుకున్నారు. ఘనమైన వివాహం తర్వాత జెఫ్ బెజోస్- అతని భార్య లారెన్ సాంచెజ్ తమ స్నేహితులతో కలిసి ప్రత్యేక పైజామా పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ వివాహంలో పాల్గొన్న అతిథులందరికీ అమెజాన్ తరపున ప్రత్యేక స్మారక బహుమతి అందించారు.

మూడు రోజుల పాటు వివాహ వేడుక

జెఫ్ బెజోస్- లారెన్ సాంచెజ్ వివాహ కార్యక్రమం వెనిస్‌లోని ఇటాలియన్ లగూన్ నగరంలో మూడు రోజుల పాటు జరిగింది. ఇందులో స్వాగత టైట్ డిన్నర్, బహిరంగ వివాహ వేడుక, పైజామా పార్టీ వంటి కార్యక్రమాలు ఉన్నాయి. జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ వివాహంలో దాదాపు 200 మంది అతిథులు పాల్గొన్నారు. అతిథులలో బిల్ గేట్స్, కిమ్ కర్దాషియన్, ఖ్లోయ్ కర్దాషియన్, జోర్డాన్ రాణి రాణియా, కైలీ జెన్నర్, కెండల్ జెన్నర్, ఓప్రా విన్‌ఫ్రే, ఆర్లాండో బ్లూమ్, మరియు గెల్ కింగ్ వంటి ఎ-లిస్టర్‌లు ఉన్నారు. ఈ వివాహంలో భారతదేశం తరపున డిజైన‌ర్‌ నటాషా పూనావాలా కూడా పాల్గొన్నారు. నటాషా గతంలో లారెన్ సాంచెజ్‌తో చాలాసార్లు కలిసి కనిపించారు.

Also Read: Telangana BJP President: తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా కొత్త వ్య‌క్తి.. సీఎం చంద్ర‌బాబు కీ రోల్‌?

అతిథులకు బహుమతిగా ప్రత్యేక చెప్పులు

వివాహం తర్వాత జరిగిన పైజామా పార్టీకి “స్వీట్ నైట్” అని పేరు పెట్టారు. ఈ పైజామా పార్టీలో ఏ అతిథి కూడా నైట్‌వేర్ ధరించలేదు. ఈ పార్టీలో స్టైలిష్ క్వీన్ కిమ్ కర్దాషియన్ ప్లంజింగ్ నెక్‌లైన్ ధరించారు. బిల్ గేట్స్ ప్రాడా డిజైనర్ పైజామా ధరించారు. అషర్ నీలం రంగు టక్సీడో ధరించగా.. ఓప్రా విన్‌ఫ్రే బ్రౌన్ సిల్క్ డ్రెస్ ధరించారు. ఈ పార్టీలో వధువు లారెన్ సాంచెజ్ సిల్క్, షిఫాన్‌తో కూడిన పింక్ రంగు అటెలియర్ వెర్సాస్ గౌన్ ధరించారు. సాంచెజ్ ముందుగా అతిథులందరికీ పైజామా థీమ్ రిసెప్షన్ పార్టీ గురించి తెలియజేశారు. అలాగే వారికి విబీ వెనెజియా బ్లూ వెల్వెట్ వెనీషియన్ చెప్పులు బహుమతిగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.