Bank Holiday: అల‌ర్ట్‌.. రేపు బ్యాంకులకు సెలవు, కార‌ణ‌మిదే?

జనవరి 25, 26 తేదీల్లో బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. శనివారం 25వ తేదీ, ఆదివారం 26వ తేదీ కావ‌డంతో బ్యాంకులకు సాధార‌ణ సెల‌వు.

Published By: HashtagU Telugu Desk
Bank Holidays

Bank Holidays

Bank Holiday: రేపు అంటే జనవరి 23వ తేదీ అన్ని బ్యాంకులకు సెలవు (Bank Holiday). ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ బ్యాంకుల నుండి హెచ్‌డిఎఫ్‌సి వంటి ప్రైవేట్ బ్యాంకుల వరకు రేపు మూత‌ప‌డ‌నున్నాయి. అయితే దేశంలో మొత్తం బ్యాంకులు మూతపడ‌వు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపురలలో మాత్రమే గురువారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ యథావిధిగా కొనసాగుతుంది.

రేపు జనవరి 23 అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, వీర్ సురేంద్ర సాయి జయంతి. ఈరోజును స్మరించుకోవడానికి బ్యాంకులకు సెలవు ఉంటుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 23న పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ని స్థాపించడం ద్వారా స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. వీర్ సురేంద్ర సాయి జయంతి కూడా జనవరి 23న జరుపుకుంటారు. వీర్ సురేంద్ర గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. ఒడిశా గిరిజన తెగ‌కు చెందిన‌ వీరుడు.

Also Read: AI Data Center: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 3600 మందికి ఉపాధి!

జనవరి 25, 26 తేదీల్లో బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. శనివారం 25వ తేదీ, ఆదివారం 26వ తేదీ కావ‌డంతో బ్యాంకులకు సాధార‌ణ సెల‌వు. ప్రస్తుత విధానంలో నెలలో రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులు మూసివేస్తారు. అయితే ప్రతి శనివారం వారానికో సెలవు దినంగా ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బ్యాంకు ఉద్యోగుల ఈ డిమాండ్ నెరవేరుతుందని భావించినా అది కుదరలేదు.

Also Read: MF Husain Paintings : ఎంఎఫ్ హుస్సేన్ రెండు పెయింటింగ్‌లు సీజ్.. వాటిలో ఏముందంటే..

ఆన్‌లైన్ బ్యాంకింగ్ కొనసాగుతుంది

బ్యాంకు సెలవుల్లో కూడా కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. బ్యాంక్ మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నిధుల బదిలీ, బిల్లు చెల్లింపు వంటి సేవలను పొందవచ్చు.

  Last Updated: 22 Jan 2025, 12:14 PM IST