ITR Filing Due Date: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing Due Date) దాఖలు చేయడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పోర్టల్ లాగిన్ అవ్వట్లేదు. స్క్రీన్ ఫ్రీజ్ అవుతోంది. తరచుగా హ్యాంగ్, లాగౌట్ అవుతోంది. కొన్నిచోట్ల సర్వర్ డౌన్ సమస్య కూడా ఉంది. దీని కారణంగా ఇప్పటికే ఐటీఆర్ దాఖలు గడువు ఒక రోజు పొడిగించారు. మరి భవిష్యత్తులో కూడా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు పొడిగిస్తారా? ఎందుకంటే ఐటీఆర్ దాఖలు చేయకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది.
లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయలేరు
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈసారి గడువును కేవలం ఒక రోజు మాత్రమే పొడిగించి సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 16కు మార్చారు. ఐటీఆర్ దాఖలు చివరి రోజున ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై అధిక ట్రాఫిక్, సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ లాగిన్ చేయడానికి, డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని నింపడానికి, సేకరించడానికి, అప్‌లోడ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఐటీఆర్ దాఖలు చేయడానికి ఒక రోజు సమయం సరిపోదు.
Also Read: Delhi Government: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ.. 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గింపు!!
ఐటీఆర్ గడువు పొడిగిస్తే ఆదా అవుతుంది
క్లియర్‌ట్యాక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అర్చిత్ గుప్తా మాట్లాడుతూ.. ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తే, పన్ను చెల్లింపుదారులకు రూ. 5000 వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఇంకా 1.5 నుండి 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉందని అంచనా. అయితే ఒక రోజు గడువు పొడిగింపును ఆలస్యంగా చేశారు. అర్ధరాత్రి గడువు పొడిగించినట్లు ప్రకటించారు. అప్పటికి చాలామంది నిద్రపోయారు. వారికి మరుసటి రోజు ఉదయం మాత్రమే గడువు పెరిగిన విషయం తెలిసింది. ఆ తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా సమయం పట్టింది. చివరి రోజులో సగం సమయం తయారీకే సరిపోయిందని, దీనికి తోడు సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.