Site icon HashtagU Telugu

Isuzu Motors : ఇసుజు మోటార్స్ ఇండియా కాన్సెప్ట్ D-MAX BEV ప్రదర్శన

Isuzu Motors India unveils Concept D-MAX BEV

Isuzu Motors India unveils Concept D-MAX BEV

Isuzu Motors :  ఇసుజు మోటార్స్ ఇండియా తన బ్యాటరీ ఎలెక్ట్రిక్ వెహికల్ (బిఈవి) ప్రోటోటైప్, D-MAX BEV విడుదలతో భారత్ మొబిలిటి ఎక్స్పో 2025 వద్ద తన ఎలెక్ట్రిక్ మొబిలిటి కాన్సెప్ట్ ను ప్రదర్శిస్తుంది. ఈ వాహనము తొలుత థాయ్‎ల్యాండ్ లో ఈ సంవత్సరం ప్రారంభములో విడుదల చేయబడింది. పికప్ ట్రక్స్ నుండి ఆశించబడే కఠినమైన పనితీరుని నిలిపి ఉంచుతూ వాణిజ్య మరియు ప్యాసెంజర్ వాహనాల విస్తృత రేంజ్ అవసరాలకు తగినట్లు D-MAX BEV అభివృద్ధి చేయబడింది. ఇది ఇసుజు యొక్క ప్రయాణాన్ని సుస్థిరమైన ఆవిష్కరణ వైపుకు ఒక అడుగును సూచిస్తుంది. మరియు భవిష్యత్తుకు సిద్ధం అయ్యే పరిష్కారాల పట్ల తన నిబద్ధతను నొక్కి చెప్తుంది.

ఈ కాన్సెప్ట్ వాహనములో ముందు మరియు వెనుక వైపు కొత్తగా అభివృద్ధి చేయబడిన ఈ-ఆక్సెల్స్ తో పూర్తి-సమయ 4WD సిస్టం ఉంది. ఇది కఠినమైన రోడ్లు మరియు లీనియర్ యాక్సెలరేషన్ పై అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ధృఢమైన చట్రము మరియు బాడీ డిజైన్ తోపాటు అధిక టోయింగ్ సామర్థ్యముతో, D-MAX BEV ప్రస్తుత డీజిల్ మాడల్స్ మాదిరిగానే పనిచేస్తుంది.

D-MAX BEV కు తోడు, ఇసుజు D-MAX S-CAB Z యొక్క యాక్సెసరైజ్డ్ వర్షన్ ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ వాహనము ధృఢమైన, విశ్వసనీయమైన మరియు బహుముఖ వాహనాలను అందించే బ్రాండ్ యొక్క వారసత్వానికి ఒక ప్రమాణము. తన మన్నిక మరియు సామర్థ్యానికి పేరుగాంచిన D-MAX S-CAB Z వాణిజ్య కార్యకలాపాల కొరకు ఇష్టపడే ఎంపికగా కొనసాగుతూ అసాధారణ పనితీరు మరియు ఫంక్షనాలిటీని అందితుంది. ఈ రెండు వాహనాలు కంపెనీ యొక్క భారత్ మొబిలిటి థీమ్ ‘నౌ…అండ్ ఫరెవర్’ కు తగినట్లు ఉంటాయి.

ఇసుజు మోటార్స్ ఇండియా 2024 సంవత్సరములో తన పోర్ట్‎ఫోలియోలో గుర్తించదగిన విజయాలను సాధించింది. ఇందులో, శ్రీ సిటి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ తయారీ సదుపాయములో ఒక లక్ష వాహనాల ఉత్పత్తి మైలురాయి ఉంది. ఈ ల్యాండ్ మార్క్ మైలురాయి తన మన్నిక మరియు విశ్వసనీయత కొరకు నమ్మకాన్ని మరియు గుర్తింపును సంప్రాదించిన ప్రముఖ ఇసుజు D-MAX మాడల్ విడుదలతో సాధించబడింది. భారతదేశము నుండి వాణిజ్య వాహనాల అగ్రగామి అయిన ఎగుమతిదారుగా ఇసుజు మోటార్స్ ఇండియా తన స్థానాన్ని కూడా బలోపేతం చేసుకొని ఇసుజు యొక్క ‘మేక్-ఇన్-ఇండియా’ నిబద్ధతను పునరుద్ఘాటించింది.

ఉత్పత్తిని వేగవంతం చేయడముతో పాటు, ఇసుజు మోటార్స్ ఇండియా దేశవ్యాప్తంగా తన ఉనికిని గణనీయంగా విస్తరించింది. ముందుకు వెళ్తూ, కంపెనీ, ఈ బ్రాండ్ ను తన వినియోగదారులకు మరింత దగ్గర చేయటానికి టచ్ పాయింట్స్ పెంచాలని వ్యూహాత్మకంగా ఆలోచిస్తోంది. తన ఉత్పత్తి లైన్ శ్రామిక శక్తిలో 22% ప్రతిభావంతులైన మహిళలు ఉండగా, ఈ కంపెనీ, శ్రామిక శక్తి వైవిధ్యములో అడుగులు వేస్తోంది – చేరిక మరియు స్వావలంబనకు తన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. నాణ్యత, విశ్వసనీయత మరియు ఆవిష్కరణల పునాదిపై నిర్మించబడిన వాహనాలను అందించడం కొనసాగిస్తుండగా, తన కార్యకలాపాలలో ఇసుజు యొక్క బ్రాండ్ భావజాలము ‘నెవర్ స్టాప్’ కనిపిస్తుంది. మరియు అథవంతమైన మొబిలిటి పరిష్కారాలను అందించడములో ప్రతి దశకు ప్రేరణ కలిగిస్తుంది.

Read Also: Kanuma Offer : ఇంటింటికీ ఫ్రీగా మటన్..ఎక్కడంటే ..!!

Exit mobile version