Copper Vs Gold : బంగారం ధరలు చుక్కలను అంటుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.98వేల దాకా రేటును పలుకుతోంది. ఈ తరుణంలో భవిష్యత్తులో బంగారం అంతటి రేంజును అందుకునే సత్తా కలిగిన ఒక లోహం గురించి చర్చ జరుగుతోంది. అదే.. రాగి (కాపర్). దానికి ఉన్న ఫ్యూచరేంటి ? రేటులో అది ఏ రేంజు దాకా వెళ్లగలదు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Underworld Don: అండర్ వరల్డ్ డాన్ కుమారుడిపై కాల్పులు.. ముత్తప్ప రాయ్ ఎవరు ?
రాగి మరో బంగారం
‘‘రాగి మరో బంగారం. దీన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఏఐ టెక్నాలజీ ఉత్పత్తులు, రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కెనడాకు బారిక్ గోల్డ్ అనేది మైనింగ్ కంపెనీ. ఇది గోల్డ్ మైనింగ్‌లో వరల్డ్ నంబర్ 2 కంపెనీ. ఈ కంపెనీ ఇప్పుడు తన పేరు నుంచి గోల్డ్‌ను తొలగించడానికి సన్నాహాలు చేస్తోంది. బారిక్ గోల్డ్ కంపెనీ రాగి తవ్వకాల విభాగంలోకి కూడా అడుగుపెడుతోంది. అందుకే ఈ కంపెనీ పేరును “బారిక్ మైనింగ్ కార్పొరేషన్”గా మార్చారు’’ అని పేర్కొంటూ వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఖనిజ వనరుల మైనింగ్ రంగంలో వ్యాపార కార్యకలాపాలను సాగిస్తున్న వేదాంత గ్రూప్ అధినేత అనిల్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరి చూపును ఆకట్టుకున్నాయి. ఇవే వ్యాఖ్యలను ఇతర సామాన్య వ్యక్తులు చేసి ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు.
Also Read :Naxal Free Village: మావోయిస్టురహితంగా ‘బడేసట్టి’.. ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం
ధరలో.. రాగి వర్సెస్ బంగారం
ప్రస్తుతం 1 కేజీ రాగి(Copper Vs Gold) రేటు కేవలం రూ.844 మాత్రమే. ఇక ఇదే సమయంలో 1 కేజీ బంగారం రేటు భారతదేశంలో రూ.52 లక్షలదాకా ఉంది. అంటే కేజీ బంగారం కావాలంటే మనం రూ.అర కోటి దాకా ఖర్చు పెట్టాలి. ప్రస్తుతానికి రాగి, బంగారం రేట్లలో భూమికి, ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. ఒకవేళ రాగిరేటు బంగారం రేంజుకు చేరాలంటే.. వెంటనే చేరదు. ఇందుకు చాలా ఏళ్ల సమయం పట్టొచ్చు. కొన్ని దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం అక్కర్లేదు. అందుకే ఇలాంటి విశ్లేషణలను విని తొందరపాటుతో రాగిని కొంటే కొంపలు మునుగుతాయి. నిపుణుల సలహాలు, విశ్లేషణలు విన్నాక.. విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం కమొడిటీ మార్కెట్లో బంగారం తర్వాత వెండికి అత్యధిక డిమాండ్ ఉంది. చాలామంది వెండిలోనూ పెట్టుబడి పెడుతున్నారు. అంతకుముందు డిమాండ్ విషయంలో.. బంగారం తర్వాతి స్థానంలో ప్లాటినం ఉండేది. కాల క్రమంలో ప్లాటినం స్థానాన్ని సిల్వర్ ఆక్రమించింది. నంబర్ 1 స్థానంలో గోల్డ్ సుస్థిరంగా నిలిచి ఉంది.నంబర్ 2 స్థానంలో మాత్రమే మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈప్లేసులోకి ఏ లోహం వస్తుందో వేచిచూడాలి.