బంగారం… ఆడవాళ్ల నుంచి మగవాళ్ల వరకు ఇష్టపడని వ్యక్తి అంటూ ఉండరేమో! ఇది కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా, ఒక మంచి సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా పరిగణించబడుతుంది. బంగారం కొనడంలో సామాజిక అవసరాలు, సంప్రదాయాలు ఉంటూనే, చివరికి అది పెట్టుబడిగా మారిపోతుంది.
కెప్టలిస్టిక్ సమాజంలో, బంగారం చాలా సంవత్సరాలుగా విలువైన పెట్టుబడిగా భావించబడింది. కానీ ఇటీవల కొన్నాళ్లుగా రేపన్నదే లేదన్నట్లుగా రికార్డుస్థాయికి పెరిగిన బంగారం ధర… అయితే ఇప్పుడు, ట్రంప్ విజయం తర్వాత, ధరలో ఊహించని తగ్గుదల కనిపించింది.
ఇది ఇంకా తగ్గి..దిగిరావొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి టైమ్‌లో బంగారంపై పెట్టుబడులు ఎంతవరకు సేఫ్.? ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టిన వారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు..?
ట్రంప్ విజయం, క్రిప్టో కరెన్సీ రీబౌండ్: గోల్డ్ ధరలు పతనమవుతున్నాయి
యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక, బులియన్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇన్వెస్టర్లు బంగారం నుంచి ఇతర పెట్టుబడుల వైపు మళ్లిపోయారు, ప్రత్యేకంగా క్రిప్టో కరెన్సీ పుంజుకుంది. బిట్‌కాయిన్ ఏకంగా మూడు రోజుల్లో 33 శాతం పైగా లాభపడింది. ఆదివారం రాత్రి, బిట్‌కాయిన్ తొలిసారిగా 90,000 డాలర్ల మాన్యూ మైలురాయిని దాటింది.
దీనికితోడు అమెరికా మార్కెట్లో బుల్ రంకెలు వేయడం గోల్డ్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పతనమవుతున్నాయి. 5 నెలల తర్వాత గతవారం గోల్డ్ రేట్ భారీగా పతమైంది. ఇదే ట్రెండ్ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని అంతర్జాతీయ బులియన్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వారి అంచనాలకు అనుగుణంగా గోల్డ్ రేట్ దిగివస్తోంది. రాబోయే రోజుల్లో 10 గ్రాముల ధర 60 వేలకి పడిపోవచ్చంటున్నారు నిపుణులు.
గోల్డ్ ధరలు పడే అవకాశాలు:
ప్రస్తుతం, ఇన్వెస్టర్లు అమెరికా నుండి వచ్చే కీలక ఆర్థిక డేటాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ వారంలో యూఎస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) విడుదల చేయబడనుండగా, రిటైల్ సేల్స్ డేటా కూడా త్వరలో వెలువడబోతున్నది. ఈ రెండు డేటాపై ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తి నెలకొంది.
అలాగే, ఈవారం యూఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ సహా ఇతర ఉన్నతాధికారులు వడ్డీరేట్ల తగ్గింపుపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ కీలక సంఘటనలు ఇన్వెస్టర్లను వేచివుండిపోయేలా చేసినప్పుడు, వారు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఇతర పెట్టుబడి సాధనాల వైపు మళ్లిస్తున్నట్లు కనపడుతోంది.
ఇక, గోల్డ్ రేట్స్ రాబోయే 4 నెలల్లో భారీగా పడిపోవచ్చని కొన్ని అంచనాలు వెలువడ్డాయి. అంతర్జాతీయ ఎనలిస్టుల ప్రకారం, బంగారం ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 20 శాతం క్షీణించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే, దేశీయ మార్కెట్లో బంగారం ధర 60,000 రూపాయలకు పడిపోవచ్చు, అని సమాచారం.
కానీ, దేశీయ ఎనలిస్టుల అంచనాలు వేరేలా ఉన్నాయి. వారు గోల్డ్ ధరలు పడే అవకాశాన్ని కొంతమేర స్వీకరించినప్పటికీ, అంతగా పెద్ద పతనం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. అంచనాలు ఏమైనప్పటికీ, సామాన్య ప్రజలు బంగారం ధరలు దిగిరావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.
బంగారం మీద పెట్టుబడులపై అయోమయం: ప్రస్తుతం ఏది సేఫ్?
సామాన్య ప్రజలు బంగారం తగ్గుతుంది అని సంబరాలు చేసుకుంటుంటే , బంగారంపై పెట్టుబడులు పెట్టినవారు ఇప్పుడు అయోమయానికి గురవుతున్నారు. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పతనమవుతాయో తెలియదు, అలా ఎప్పటికప్పుడు ఏ చిన్న న్యూస్ కూడా షేర్స్ విలువను ప్రభావితం చేయవచ్చు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, బంగారం ధరలు పెరగడం కాకుండా, ఇటీవల తగ్గడమే ఎక్కువగా కనిపించింది.
ట్రంప్ విజయం వచ్చిన తర్వాత, అనుకోకుండా గోల్డ్ డిమాండ్ కొంత తగ్గడంతో, బంగారం ధరలు దాదాపుగా పడిపోయాయి. ఈ పరిణామంతో, ఇప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టడం సేఫ్‌నా లేదా అన్నది ఎక్కువ మంది ప్రశ్నిస్తున్న అంశంగా మారింది.
దీంతో, భవిష్యత్‌లో డబ్బు దాచుకోవాలని అనుకునే చాలామంది, ఇప్పటికీ బంగారాన్ని ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడులు పెట్టడం సేఫ్‌నా అని వారు ఆలోచిస్తున్నారు.
మరోవైపు, ఇప్పటి వరకు బంగారం లో పెట్టుబడులు పెట్టిన వారు, భవిష్యత్‌లో మరింత ధర తగ్గితే తమ పెట్టుబడుల పరిస్థితి ఏంటి అన్నట్లు అయోమయంలో ఉన్నారు.