IPHONE16 : ఐఫొన్‌ 16 కోసం ఎగబడ్డ కస్టమర్లు

IPHONE16 : ఐఫొన్‌ 16 కోసం ఎగబడ్డ కస్టమర్లు

Published By: HashtagU Telugu Desk
Iphone 16 Series Sale Kicks

Iphone 16 Series Sale Kicks

16 సిరీస్ (IPhone 16) ఫోన్లు భారత్‌లో అందుబాటులోకి రావడంతో ఫోన్ కోసం ప్రజలు ఎగబడ్డారు. ఐఫోన్​ 16 సిరీస్​ని కొన్ని రోజుల క్రితమే యాపిల్​ సంస్థ లంచ్​ చేసింది. ఇక ఐఫోన్ 16 సిరీస్ ఈరోజు నుండి మన దేశంలో అందుబాటులోకి వచ్చింది.

సాంకేతిక తరహాలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు యాపిల్‌ స్టోర్‌ల ముందు భారీగా క్యూ కట్టారు. ముంబై, ఢిల్లీతో సహా పలు యాపిల్‌ స్టోర్‌ (Delhi and Mumbai stores)ల బయట కొనుగోలుదారులు పెద్దఎత్తున బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇందులో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రొ, ఐఫోన్‌ ప్రొ మ్యాక్స్‌.. అనే నాలుగు మోడళ్లను యాపిల్‌ తీసుకొచ్చింది.

భారతదేశంలో ఐఫోన్ 16 సిరీస్ (Apple iPhone 16 series) ధరలు చూస్తే..

ఐఫోన్ 16 :

128 జీబీ: రూ.79,900
256 జీబీ: రూ.89,900
512 జీబీ: రూ.1,09,900

ఐఫోన్ 16 ప్లస్ :

128 జీబీ: రూ.89,900
256 జీబీ: రూ.99,900
512 జీబీ: రూ.1,19,900

ఐఫోన్​ 16 ప్రో :

128 జీబీ: రూ.1,19,900
256 జీబీ: రూ.1,29,900
512 జీబీ: రూ.1,49,900
1టీబీ: రూ.1,69,900

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ :

256 జీబీ: రూ.1,44,900
512 జీబీ: రూ.1,64,900
1టీబీ: రూ.1,84,900

  Last Updated: 20 Sep 2024, 11:26 AM IST