Mukesh Ambani Jackpot : మనం ఏదైనా పెట్టుబడి పెడితే.. దానిపై 10 శాతం లాభం వస్తే అదే చాలా ఎక్కువ. ఒకవేళ 20 శాతం దాకా లాభం వస్తే ఇంకా చాలా ఎక్కువ. అలాంటిది ముకేశ్ అంబానీ పెట్టిన ఒక పెట్టుబడి ఆయనకు ఏకంగా 2000 శాతం లాభాన్ని సంపాదించి పెట్టింది. 2008 సంవత్సరంలో ఏషియన్ పెయింట్స్ కంపెనీలో ముకేశ్ రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టి 4.9 శాతం వాటాను తీసుకున్నారు. ఇప్పుడు ఆ పెట్టుబడి విలువ ఏకంగా రూ.10,500 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు రూ.10వేల లాభం ముకేశ్ అంబానీ జేబులోకి రానుంది. 2008 నుంచి 2025 వరకు.. అంటే దాదాపు 17 ఏళ్లు వెయిట్ చేసినందుకు ముకేశ్ అంబానీకి రూ.10వేల కోట్ల లాభాన్ని ఏషియన్ పెయింట్స్ కంపెనీ సంపాదించి పెట్టింది. లాంగ్ టర్మ్ పెట్టుబడి విజన్‌తో ఇంతభారీ లాభాన్ని సంపాదించడం ద్వారా తాను భారతీయ వారెన్ బఫెట్ అని ముకేశ్ నిరూపించుకున్నారు.
Also Read :Bibinagar : మిర్యాలగూడ – కాచిగూడ రైలులో మంటలు.. ఏమైంది ?
రూ.3,394 షేరు.. రూ.2,291కు డౌన్
కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. ఏషియన్ పెయింట్స్ కంపెనీలోని తన 4.9 శాతం వాటాను అమ్మేసి ఎగ్జిట్ అవుదామని ముకేశ్ అంబానీ అనుకుంటున్నారట. ఈ ఒప్పందాన్ని నిర్వహించే బాధ్యతను బ్యాంక్ ఆఫ్ అమెరికాకు రిలయన్స్ అప్పగించింది. ఏషియన్ పెయింట్స్‌లోని ముకేశ్ షేర్లను బ్లాక్ డీల్ ద్వారా విక్రయిస్తారు కానీ కొనుగోలుదారులు మార్కెట్ ధర కంటే 6-7% తగ్గింపును కోరుతున్నారు. ఈ వార్తలు వచ్చాయో లేదో ఏషియన్ పెయింట్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 15న రూ.2,415 పలికిన ఏషియన్ పెయింట్స్ షేరు ధర.. తాజాాగా ఈరోజు రూ.2,291.40కు పతనమైంది. అంటే నెల రోజుల్లో దాదాపు రూ.120 దాకా షేరు రేటు డౌన్ అయింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 3,394. అంటే ముకేశ్ అంబానీ వాటా అమ్మేస్తున్నారనే వార్త దీన్ని ఎంత ప్రతికూలంగా ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.
Also Read :Saraswati River Mystery : సరస్వతీ నది ఎలా అదృశ్యమైంది.. రీసెర్చ్‌లో ఏం తేలింది ?
ఈ కారణాల వల్లే అంబానీ ఎగ్జిట్ ?
కుమార్ మంగళం బిర్లా పెయింట్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఏషియన్ పెయింట్స్ నుంచి ముకేశ్ అంబానీ(Mukesh Ambani Jackpot) ఎగ్జిట్ కొడుతున్నారు. దీంతోపాటు ప్రస్తుతం పెయింట్స్ పరిశ్రమలో మార్జిన్ ఒత్తిడి పెరిగింది. పోటీ కూడా పెరిగింది. దీనివల్లే ఏషియన్ పెయింట్స్ షేరు ధర తగ్గిపోతోందని విశ్లేషకులు అంచనా వేశారు. భారతదేశ పెయింట్స్ మార్కెట్లో ఏషియన్ పెయింట్స్‌కు 44 శాతం వాటా ఉంది. ఈ విభాగంలో ఏషియన్ పెయింట్స్ ఆసియాలో రెండో స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది.