Spam Calls : స్పామ్ కాల్స్, మెసేజ్‌ల కట్టడి కోసం ఐకమత్యంగా పనిచేసేందుకు భారత టెలికాం కంపెనీలు రెడీ అయ్యాయి. తమ మధ్య ఉన్న పోటీని పక్కన పెట్టి.. స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌ల సమస్యను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టాయి. త్వరలోనే టెలికాం కంపెనీలన్నీ కలిసి ఇందుకోసం ఒక ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ నుంచి టెలికాం కంపెనీలకు మార్గదర్శకాలు(Spam Calls) అందాయి.
Also Read :Maoists Surrender Policy : సరెండర్ అయ్యే మావోయిస్టుల కోసం సరికొత్త పాలసీ
స్పామ్ కాల్స్ వల్ల వినియోగదారులు చాలా ఇరిటేషన్‌కు గురవుతున్నారు. వాటి వల్ల యూజర్ల విలువైన సమయం వేస్ట్ అవుతోంది. స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లను పంపే నంబర్ల సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకొని వాటి యాక్టివిటీని ఆపేయడమే తొలి లక్ష్యంగా టెలికాం కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. స్పామ్ మెసేజ్‌ల వల్ల సైబర్ నేరాలు కూడా జరుగుతున్నాయి. స్పామ్ మెసేజ్‌లలో ఉన్న యూఆర్ఎల్ వెబ్ లింకులను క్లిక్ చేసి.. డబ్బులను పోగొట్టుకున్న వారు చాలామందే ఉన్నారు. స్పామ్ మెసేజ్‌లను ఆపితే సైబర్ క్రైమ్స్‌కు చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు. మోసపూరిత మార్కెటింగ్ సందేశాలను ఆపడం ద్వారా ప్రజలు దుబారా ఖర్చులు చేయకుండా కాపాడొచ్చు.
Also Read :US Navy Seals : చైనాకు షాక్.. తైవాన్ ఆర్మీకి అమెరికా నేవీ సీల్స్ ట్రైనింగ్
మన దేశంలో ప్రతిరోజు 150 నుంచి 170 కోట్ల స్పామ్ మెసేజ్‌లు టెలికాం వినియోగదారులకు వెళుతున్నాయనేది ఒక అంచనా. ప్రతినెలా సగటున 550 కోట్ల స్పామ్ మెసేజ్‌లు ప్రజల ఫోన్లకు చేరుతున్నాయట. ప్రతి 10 మంది ఫోన్ వినియోగదారుల్లో ఆరుగురికి రోజుకు సగటున మూడు స్పామ్ కాల్స్ వెళ్తున్నాయట. స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లు ప్రధానంగా ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగ కంపెనీల నుంచే యూజర్లకు వెళ్తున్నాయట. ఏదిఏమైనప్పటికీ స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌ల పనిపట్టే దిశగా అడుగులు పడుతుండటం మంచి పరిణామమే అని చెప్పొచ్చు.