Site icon HashtagU Telugu

Trump Tariffs : ట్రంప్ దెబ్బకు కుదేల్ అవుతున్న భారత కుబేరులు

Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump tariffs) మళ్లీ వాణిజ్య విధానాలను కఠినంగా మారుస్తుండడం తో ప్రపంచ మార్కెట్లు (World Markets) కుదేలవుతున్నాయి. ట్రంప్ నిర్ణయాల కారణంగా పెట్టుబడిదారులు వెనుకడుగు వేయడంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా భారతీయ కుబేరులు ఒక్కరోజులోనే 10.3 బిలియన్ డాలర్లకు పైగా సంపద కోల్పోయారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం.. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందాల్ ఫ్యామిలీ, శివ్ నాడార్ (Mukesh Ambani, Gautam Adani, Savitri Jindal Family, Shiv Nadar) లాంటి ప్రముఖ వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున నష్టాన్ని చవిచూశారు.

Fake Videos on HCU Land : కేటీఆర్ మరో చిక్కుల్లో పడబోతున్నాడా..?

ముఖ్యంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఒక్కరోజులో 3.6 బిలియన్ డాలర్ల నష్టంతో 87.7 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 3 బిలియన్ డాలర్లు కోల్పోయి 57.3 బిలియన్లకు చేరారు. జిందాల్ గ్రూప్‌ను ప్రతినిధ్యం వహిస్తున్న సావిత్రి జిందాల్ ఫ్యామిలీ 2.2 బిలియన్ డాలర్లు కోల్పోయింది. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 1.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. భారత మార్కెట్లపై ట్రంప్ నిర్ణయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

CBN & Pawan : బాబు పెద్ద మనసుకు పవన్ ఫిదా

అయితే ఈ ప్రభావం కేవలం భారత్‌ వరకే పరిమితం కాలేదు. ప్రపంచ కుబేరుల సంపద కూడా తారాస్థాయిలో మారిపోయింది. ఎలాన్ మస్క్ 130 బిలియన్ డాలర్లు కోల్పోయి 302 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యారు. జెఫ్ బెజోస్ 45.2 బిలియన్లు, మార్క్ జూకర్‌బర్గ్ 28.1 బిలియన్లు, బెర్నార్డ్ ఆర్నాల్ట్ 18.6 బిలియన్లు, బిల్ గేట్స్ 3.38 బిలియన్లు కోల్పోయారు. మాంద్యం భయాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, పెట్టుబడులపై అనిశ్చితి ఈ విధంగా ప్రపంచ కుబేరుల సంపదను కొట్టేశాయి.