Credit Cards : ఈ క్రెడిట్ కార్డులతో ఆదాయపు పన్ను చెల్లిస్తే రివార్డ్స్

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)ను ఫైల్ చేసేందుకు లాస్ట్ డేట్ డిసెంబరు 31.

  • Written By:
  • Publish Date - July 24, 2024 / 08:30 AM IST

Credit Cards : గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)ను ఫైల్ చేసేందుకు లాస్ట్ డేట్ డిసెంబరు 31. అయితే ఫ్రీగా దాన్ని సమర్పించేందుకు లాస్ట్ డేట్ ఈనెల (జులై) 31.  అయితే ఈ గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే.. రూ. 5 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు రూ. 5,000 ఆలస్య రుసుం చెల్లించాలి. రూ. 5 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు రూ. 1,000 పెనాల్టీ కట్టాలి. దీనికి అదనంగా ట్యాక్స్ కు వడ్డీ కూడా కట్టాలి.  ఈవిధంగా పెనాల్టీతో డిసెంబర్ 31 వరకు ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. పెనాల్టీ వద్దు.. అనుకుంటే ఈ నెలాఖరులోగా ఐటీఆర్‌ను సబ్మిట్ చేయాలి. ఈక్రమంలో కొన్ని క్రెడిట్ కార్డులను(Credit Cards)  వినియోగిస్తే ప్రయోజనం ఉంటుంది. ఇంతకీ అవేమిటో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఇవి తెలుసుకోండి.. 

ట్యాక్స్(Income Tax) పే చేసేవారు ఐటీ పన్ను విధానాల గురించి తెలుసుకోవాలి. పాత ఐటీ పన్నువిధానం, కొత్త ఐటీ పన్నువిధానం అందుబాటులో ఉన్నాయి. వీటిలో మనం ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.  సాధారణంగానైతే అందరికీ డీఫాల్ట్‌గా కొత్త పన్ను విధానమే వర్తిస్తుంది. దీని ద్వారా రూ. 7 లక్షల దాకా ఆదాయం కలిగినవారు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకుంటే.. మినహాయింపులు ఎక్కువగా లభిస్తాయి. అందుకే మనం మనకు లాభం చేకూర్చేలా ఉండే పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. ఐటీర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 అనే రకాల పత్రాలు ఉంటాయి. వీటిలో మన అవసరాలను తీర్చేదాన్ని ఎంపిక చేసుకోవాలి.

Also Read :Gold Price : కిలోకు రూ.6.20 లక్షలు తగ్గిన బంగారం.. ఎందుకు ?

ఈ క్రెడిట్ కార్డులతో.. 

  • కొందరు తమ క్రెడిట్ కార్డుల ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులు చేస్తుంటారు. అయితే ఆదాయపు పన్ను చెల్లింపుపై అన్ని రకాల క్రెడిట్ కార్డులు రివార్డు పాయింట్స్ ఇవ్వవు.
  • ఏటా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులను క్రెడిట్ కార్డులతో చేసేవారు.. అందుకు అనుగుణమైన కార్డులను తీసుకోవాలి. అవసరం అనుకుంటే.. ఇప్పుడున్న క్రెడిట్ కార్డు నుంచి అలాంటి బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డులకు మారిపోవచ్చు.
  • ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌‌సీ బిజ్‌బ్లాక్, హెచ్‌డీఎఫ్‌సీ బిజ్‌పవర్ క్రెడిట్ కార్డ్‌లు వంటి కొన్ని సెలక్టెడ్ కార్డులతో పన్ను చెల్లింపులు చేస్తే రివార్డులు వస్తాయి. ఈ కార్డులు పన్ను చెల్లింపుదారులకు గరిష్టంగా 16 శాతం దాకా పొదుపును  అందిస్తాయి. జీఎస్టీ చెల్లింపులపై 8 శాతం దాకా ఆదా చేసుకోవచ్చు.
  • ఎస్‌బీఐ విస్తారా కార్డ్, ఐడీఎఫ్‌‌సీ విస్తారా కార్డ్‌తోనూ ఆదాయపు పన్ను చెల్లింపుపై మైల్ స్టోన్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.
  • ట్యాక్స్ పేమెంట్స్ ద్వారా క్రెడిట్ కార్డుల యూజర్లకు లభించే రివార్డ్ పాయింట్లను వెంటనే రీడీమ్ చేసుకోలేం. తగినన్ని పాయింట్లు జమయ్యాక.. అన్నీ కలిపి ఏదైనా షాపింగ్ టైంలో వాటిని రీడీమ్ చేసుకోవచ్చు.
  • రివార్డ్ పాయింట్లను తాజ్ హోటల్, లాంజ్ యాక్సెస్, మారియట్ హోటల్‌ వంటి బ్రాండ్ భాగస్వాముల దగ్గర రీడీమ్ చేయొచ్చు.
  • వాస్తవానికి పైన మనం చెప్పుకున్న క్రెడిట్ కార్డులను అధిక ఆదాయ వర్గాలకు చెందిన వారు మాత్రమే వాడుతుంటారు. అందుకే వాటిపై వార్షిక ప్రయోజనాలు లక్షల వరకు ఉంటాయి.
Follow us