Bill Gates : తాను అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికి మారిజ్వానా (ఎల్‌ఎస్‌డీ) అనే మత్తు పదార్థాన్ని కొన్నిసార్లు స్మోక్ చేశానని టెక్ మొగల్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ వెల్లడించారు. అయితే అది తన స్కూల్ డేస్ నాటి ముచ్చట అని ఆయన తెలిపారు. వినోదం కోసం మాత్రమే తాను అప్పట్లో (టీనేజీలో) మారిజ్వానాను స్మోక్ చేశానని బిల్‌గేట్స్ చెప్పారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేసి బుట్టలో వేసుకునే వ్యూహంలో భాగంగానే అలా చేసేవాడినన్నారు. అయితే తన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ‘సోర్స్ కోడ్ – మై బిగినింగ్స్’ పేరిట బిల్ గేట్స్ ఒక పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. అందులో తన చిన్ననాటి జీవితంలోని కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.
Also Read :Rahul Gandhi : ఔను.. అప్పుడు దళితులు, బీసీలను కాంగ్రెస్ విస్మరించింది.. రాహుల్ వ్యాఖ్యలు
టీచర్ లాంజ్‌లో మద్యం తాగాను
‘‘అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న లేక్ సైడ్ స్కూల్‌లో చదివేటప్పుడు నేను మా టీచర్ లాంజ్‌లో మద్యం తాగాను. దీంతో స్కూలు నుంచి బయటికి పంపారు. పాల్ అలెన్ వల్లే నాకు మద్యం అలవాటైంది. అతడు పదేపదే ఒత్తిడి చేయడం వల్లే నేను మద్యం తాగడం అలవాటు చేసుకున్నాను. తొలిసారిగా నేను విస్కీ తాగడం మర్చిపోలేని విషయం. ఎందుకంటే చెప్పుకోలేనంతగా అతిగా విస్కీ తాగేశాను. ఆ ప్రభావంతో ఇప్పటికీ నాకు విస్కీ టేస్టీగా అనిపించదు. బహుశా మొదటిసారే అతిగా తాగేయడం వల్ల దాని రుచిని కోల్పోయి ఉంటాను’’ అని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు.
పాల్ అలెన్ నాకు క్లోజ్ ఫ్రెండ్
‘‘పాల్ అలెన్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతడు, నేను కలిసి 1975లో మైక్రోసాఫ్ట్(Bill Gates) ఏర్పాటు చేశాం. పాల్ అలెన్‌ను చూసి నేను స్ఫూర్తి పొందేవాడిని. మా ఇద్దరికీ కంప్యూటర్లపై చాలా ఆసక్తి ఉండేది. అందుకే మైక్రోసాఫ్ట్‌ను ఏర్పాటు చేసి సక్సెస్‌ఫుల్‌గా నడపగలిగాం’’ అని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.
Also Read :Gandhiji Historic Places : ఇవాళ గాంధీజీ వర్ధంతి.. ఆయనతో ముడిపడిన 7 చారిత్రక ప్రదేశాలివీ
మా అమ్మానాన్న ఆరాటం చాలా గొప్పది
‘‘నేను చిన్నప్పుడు ఆటిజం సమస్యతో బాధపడ్డాను. దానికి ఎలాంటి వైద్యం అందించాలో అప్పట్లో మా పేరెంట్స్‌కు తెలియదు. వివిధ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. నన్ను మామూలు బాలుడిగా చేసేందుకు మా అమ్మానాన్నలు పడిన ఆరాటం చాలా గొప్పది’’ అని బిల్ గేట్స్ తెలిపారు. ‘‘నా చిన్ననాటి స్నేహితుడు ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం నన్ను చాలా కలచివేసింది’’ అని ఆయన పేర్కొన్నారు.