Site icon HashtagU Telugu

PAN- Aadhaar: పాన్ కార్డు ఉన్న‌వారికి బిగ్ అల‌ర్ట్‌.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే ఛాన్స్‌!

PAN- Aadhaar

PAN- Aadhaar

PAN- Aadhaar: మీరు ఇంకా మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా? అయితే ఈ పని పూర్తి చేయడానికి మీకు డిసెంబర్ 31, 2025 వరకు సమయం ఉంది. పాన్‌ను ఆధార్‌ (PAN- Aadhaar)తో లింక్ చేయడానికి ఇదే చివరి తేదీ. మీరు ఈ గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోత మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ (Inactive) అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయలేరు. అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతాలో జీతం కూడా జమ కాదు.

పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?

పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే గడువు గురించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. గడువులోగా పాన్/ఆధార్ లింక్ చేసే ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది.

Also Read: RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

పాన్- ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి?

  1. పాన్- ఆధార్‌ను లింక్ చేయడానికి మీరు ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ను సందర్శించాలి.
  2. ఇప్పుడు ‘లింక్ ఆధార్’ (Link Aadhaar) పై క్లిక్ చేయండి.
  3. మీరు డిసెంబర్ 31, 2025 తర్వాత లింక్ చేస్తే మీరు రూ. 1,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
  4. ఆధార్‌తో అనుసంధానించబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఉపయోగించి ధృవీకరించండి (Verify).
  5. ఈ పోర్టల్ ద్వారా మీ పాన్- ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో కూడా మీరు తనిఖీ చేయవచ్చు.

2026 ప్రారంభం తర్వాత కొత్త పెట్టుబడులలో అడ్డంకులు, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమస్యలు లేదా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు, రిఫండ్ పొందడంలో ఇబ్బందులు వంటి ఏదైనా ఆర్థిక ఇబ్బందులను నివారించాలంటే సమయానికి మీ పాన్, ఆధార్ కార్డును లింక్ చేసుకోండి.

Exit mobile version