UPI Payment Fail: ఒకవేళ UPI లావాదేవీ విఫలమై మీ ఖాతా నుండి డబ్బు కట్ అయితే నిర్ణీత సమయంలోగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత బ్యాంక్ లేదా UPI యాప్‌పై ఉంటుంది. సాధారణంగా 1 పని దినంలోపు డబ్బు ఆటోమేటిక్‌గా తిరిగి రావాలి. కొన్నిసార్లు ఇది తక్షణమే జరుగుతుంది. మరికొన్ని సార్లు ఆలస్యం కావచ్చు. ఈ ఆలస్యమే పరిహారం పొందడానికి ఆధారం అవుతుంది.
ఏ సందర్భాల్లో పరిహారం లభిస్తుంది?
RBI, NPCI నిబంధనల ప్రకారం బ్యాంక్ లేదా UPI సర్వీస్ ప్రొవైడర్ నిర్ణీత గడువులోగా విఫలమైన లావాదేవీని సరిచేయకపోతే వినియోగదారుడు పరిహారానికి అర్హుడు. ఈ పరిహారం మీ రీఫండ్ కంటే అదనంగా ఉంటుంది. అంటే మొదట మీ డబ్బు మీకు వస్తుంది. ఆ తర్వాత ఆలస్యానికి గానూ అదనపు మొత్తం చెల్లిస్తారు. అయితే ఈ తప్పు బ్యాంక్, సర్వర్ లేదా యాప్ వైపు నుండి జరిగినప్పుడు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది.
ఎంత పరిహారం లభిస్తుంది?
పరిహారం మొత్తం లావాదేవీ పరిష్కారంలో జరిగిన ఆలస్యంపై ఆధారపడి ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ. 100 చొప్పున జరిమానా విధించబడుతుంది. ఈ మొత్తాన్ని నేరుగా వినియోగదారుడికి చెల్లిస్తారు. కంపెనీలు నిర్లక్ష్యం వహించకుండా ఉండటానికి ఈ నిబంధనను తీసుకువచ్చారు.
Also Read: పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !
UPI పేమెంట్ ఫెయిల్ అయితే ఫిర్యాదు చేయడం ఎలా?
- డబ్బు కట్ అయి తిరిగి రాకపోతే ముందుగా మీరు ఏ UPI యాప్ ద్వారా పేమెంట్ చేశారో అదే యాప్‌లో ఫిర్యాదు చేయండి.
- లావాదేవీ చరిత్రలోకి వెళ్లి విఫలమైన పేమెంట్‌ను ఎంచుకోండి.
- “Help” లేదా “Report a Problem” ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ మీ UTR నంబర్ లేదా ట్రాన్సాక్షన్ IDని నమోదు చేయండి. దీనివల్ల మీ ఫిర్యాదు త్వరగా ట్రాక్ అవుతుంది.
- ప్రతి ఫెయిల్ ట్రాన్సాక్షన్‌కు పరిహారం లభించదు
- ప్రతి విఫలమైన లావాదేవీకి పరిహారం రాదని గుర్తుంచుకోవాలి. తప్పు మీ వైపు నుండి జరిగినప్పుడు అంటే
- తప్పు UPI ID ఎంటర్ చేయడం.
- మీ నెట్‌వర్క్ సమస్య వల్ల పేమెంట్ ఆగిపోవడం.
- లావాదేవీ వెంటనే రివర్స్ (వెంటనే తిరిగి రావడం) కావడం. ఇలాంటి సందర్భాల్లో పరిహారం వర్తించదు.
సమస్య పరిష్కారం కాకపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
యాప్, బ్యాంక్ రెండింటి ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే మీరు NPCI లేదా RBI అధికారిక ఫిర్యాదు పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ నమోదైన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తారు. మీ ఆరోపణ నిజమని తేలితే డబ్బుతో పాటు పరిహారం కూడా అందుతుంది.
UPI ఉపయోగిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి
- పేమెంట్ చేసే ముందు ఎప్పుడూ UPI IDని సరిచూసుకోండి.
- ఇంటర్నెట్ కనెక్షన్ బలంగా ఉండేలా చూసుకోండి.
- పేమెంట్ పూర్తయ్యే వరకు యాప్‌ను క్లోజ్ చేయకండి.
- ప్రతి లావాదేవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను భద్రపరుచుకోండి, ఇది ఫిర్యాదు చేసేటప్పుడు సాక్ష్యంగా ఉపయోగపడుతుంది.
