8th Pay Commission: కేంద్రీయ ఉద్యోగులు, పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం (8th Pay Commission) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి మనసులో దీనికి సంబంధించి అనేక సందేహాలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల జీతం, హెచ్‌ఆర్‌ఏలో ఎంత వృద్ధి ఉంటుందనేది తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏమైనా వర్తిస్తుందా? అలాగే బేసిక్ జీతం ఎంత ఉంటుంది? పిల్లల విద్య, ప్రయాణ భత్యం కోసం ఎంత లభిస్తుంది అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ఎనిమిదవ వేతన సంఘంలో ఇవన్నీ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే నిర్ణయిస్తారు. దీని ప్రభావం హెచ్‌ఆర్‌ఏ నుండి ప్రయాణ భత్యం వరకు ఉంటుంది.
జీతం ఎలా నిర్ణయిస్తారు?
ఎనిమిదవ వేతన సంఘంలో జీతం 2.08 ఫిట్‌మెంట్ ఆధారంగా నిర్ణయించబడుతుందని భావిస్తున్నారు. ఇంతకుముందు ఏడవ వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తించగా, ఆరవ వేతన సంఘంలో 1.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంది. అందువల్ల వేతన సంఘం నివేదిక, ప్రకటన తర్వాతే ఈ మార్పులు జరుగుతాయి. అయితే 2.08 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తిస్తే అన్ని కేంద్రీయ ఉద్యోగుల బేసిక్ జీతం, ఇతర భత్యాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: AP Results Day : ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు – చంద్రబాబు
జీతం ఎంత పెరుగుతుంది?
2.08 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వర్తించిన తర్వాత ఎనిమిదవ వేతన సంఘంలో లెవెల్-2లో 1900 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం రూ. 52,555 వరకు పెరగవచ్చు. అలాగే లెవెల్-4లో 2400 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం రూ. 75,762కి పెరగవచ్చు.
అదేవిధంగా లెవెల్-5లో 2800 గ్రేడ్ వరకు ఉన్న ఉద్యోగుల జీతం రూ. 96,301కి పెరుగుతుంది. లెవెల్-6లో 4200 గ్రేడ్ ఉన్న ఉద్యోగుల జీతం రూ. 94,883కి పెరుగుతుంది. లెవెల్-8లో 4800 గ్రేడ్ ఉన్న ఉద్యోగుల జీతం రూ. 1,13,190కి పెరుగుతుంది, అయితే లెవెల్-9లో 5400 గ్రేడ్ ఉన్న ఉద్యోగుల జీతం రూ. 1,46,583కి పెరుగుతుంది.
ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే.. వేతన సంఘంలో సీనియర్ ఆర్థికవేత్తలు, రిటైర్డ్ జస్టిస్, నిపుణులు, అనుభవజ్ఞులైన అధికారులు ఉంటారు. వీరు ట్రేడ్ యూనియన్లు, ఇతర వ్యక్తులతో చర్చించి ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పిస్తారు. ఆ తర్వాత అంతిమ నిర్ణయం అమలు చేయడం ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది.