అక్షయ తృతీయ (Akshaya Tritiya) పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రజలు సంప్రదాయంగా బంగారం (Gold) కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా బంగారం మార్కెట్‌లో కొంత ఉత్సాహం కనిపించినప్పటికీ, అంచనాల మేరకు అమ్మకాలు జరగలేదని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. దేశవ్యాప్తంగా దాదాపు 20 టన్నుల బంగారం అమ్ముడైందని , దీని విలువ రూ.18 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూ ఉండటంతో, కొనుగోలుదారులు కొంత వెనుకంజ వేశారు. ఈ కారణంగా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు కాలేదని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈసారి గోల్డ్ ఇటీఎఫ్‌లు (Gold ETFs) వైపు ప్రజల ఆసక్తి పెరిగిందని తెలుస్తోంది. అదనంగా కొందరు పాత బంగారాన్ని మార్చుకొని కొత్త మోడల్ గోల్డ్ కొనుగోలు చేశారు. దీని వల్ల బంగారం అమ్మకాల్లో నూతన కొనుగోళ్ల కంటే మార్పిడి వ్యవహారాలు ఎక్కువగా జరిగాయని సమాచారం.
US Economy: దయనీయ స్థితిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ?
ఇదిలా ఉంటే అక్షయ తృతీయ తర్వాత రోజు అంటే ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,000 తగ్గి ట్రేడవుతుండడం గమనార్హం. ఇది కొనుగోలుదారులకు కొంత ఊరటను కలిగించవచ్చని నిపుణుల అభిప్రాయం. కాగా బంగారం ధరలు స్తిరంగా ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్‌లో మరిన్ని కొనుగోళ్లు జరగవచ్చని జ్యువెలరీ వ్యాపారులు ఆశిస్తున్నారు.