Gold Rates: బంగారం ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

భారతీయులకు బంగారంపై ఉన్న ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రస్తుతం దేశీయ పసిడి మార్కెట్లో ఊహించని ట్రెండ్ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకం పెంచిన తర్వాత.. కొత్త బంగారం కొనుగోళ్లు భారీగా క్షీణించాయి. ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) తాజా నివేదిక ప్రకారం మార్కెట్లో బంగారం డిమాండ్ ఏకంగా 70 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. విచిత్రం ఏంటంటే.. ఇక్కడ జనాలు కొత్త నగలు కొనడం మానేసి.. తమ ఇళ్లలో […]

Published By: HashtagU Telugu Desk
Here is the current status of gold prices:

Here is the current status of gold prices:

భారతీయులకు బంగారంపై ఉన్న ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ప్రస్తుతం దేశీయ పసిడి మార్కెట్లో ఊహించని ట్రెండ్ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకం పెంచిన తర్వాత.. కొత్త బంగారం కొనుగోళ్లు భారీగా క్షీణించాయి. ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) తాజా నివేదిక ప్రకారం మార్కెట్లో బంగారం డిమాండ్ ఏకంగా 70 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. విచిత్రం ఏంటంటే.. ఇక్కడ జనాలు కొత్త నగలు కొనడం మానేసి.. తమ ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని అమ్మేందుకు జువెల్లరీ షాపులకు క్యూ కడుతున్నారు. అసలు మార్కెట్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

సుంకాల పెంపు తర్వాత భారతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ 70 శాతానికి పైగా తగ్గిందని ఐబీజేఏ సెక్రటరీ సురేంద్ర మెహ్తా చెప్పారు. కేంద్రం మే 13న బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులు బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సుంకాలు పెరిగాయి. విదేశీ మారకపు నిల్వలను ఆదా చేసుకునేందుకు, బంగారం కొనుగోళ్లు, దిగుమతులను తగ్గించేందుకు ఈ ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొనుగోళ్లు తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో గోల్డ్ లోన్లకు కూడా గిరాకీ పెరిగిందని మెహ్తా చెబుతున్నారు.

పెరిగిన ధరలు, సుంకం పెంపు – ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడంతో బంగారం ధరలు మరింత పెరిగాయి. ఇటీవల ధరలు భారీగా తగ్గినప్పటికీ ఇంకా గరిష్ఠ స్థాయిల్లోనే ఉన్నాయి.

పాత బంగారానికి క్రేజ్ – మరోవైపు బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పతనం అవుతాయన్న భయంతో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అధిక రేటుకే ఇళ్లలో వాడకుండా నిరుపయోగంగా ఉన్న పాత గాజులు, గొలుసులు అమ్మి క్యాష్ చేసుకునేందుకు లేదా వాటిని ఇచ్చి కొత్త డిజైన్లు మార్చుకునేందుకు మిడిల్ క్లాస్ కుటుంబాలు ఆసక్తి చూపిస్తున్నాయి.

లిక్విడిటీ అవసరాలు – పెళ్లిళ్ల సీజన్ ముగియడం, విద్యా సంవత్సరం ప్రారంభం (స్కూల్, కాలేజీ ఫీజులు) కావడంతో డబ్బుల కోసం కూడా కొందరు తమ పాత బంగారాన్ని అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే జులై 2న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పుత్తడి ధర తులం రూ. 1,32,500 వద్ద ఉంది. ఉదయం 10 గంటల తర్వాత ఏకంగా రూ. 3,450 పెరిగింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,44,550 వద్ద ఉంది.

 

  Last Updated: 02 Jul 2026, 11:32 AM IST