2026లో ఏపీ–తెలంగాణ బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే..

ప్రతిసారి కొత్త సంవత్సరం మొదలవుతుందంటే ఉద్యోగులు, వ్యాపారులు, బ్యాంకు వినియోగదారులు ముందుగా తెలుసుకోవాల్సిన అంశాల్లో బ్యాంక్ సెలవుల జాబితా ఒకటి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ షెడ్యూల్‌ను ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Here are the details of AP-Telangana bank holidays in 2026.

Here are the details of AP-Telangana bank holidays in 2026.

. జాతీయ సెలవులు, వారాంతపు హాలిడేస్‌లు

. పండగల సందర్భంగా బ్యాంకులకు విరామం

. ఏపీ, తెలంగాణకు ప్రత్యేకమైన బ్యాంక్ సెలవులు

Bank Holidays list : కొద్ది రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ప్రతిసారి కొత్త సంవత్సరం మొదలవుతుందంటే ఉద్యోగులు, వ్యాపారులు, బ్యాంకు వినియోగదారులు ముందుగా తెలుసుకోవాల్సిన అంశాల్లో బ్యాంక్ సెలవుల జాబితా ఒకటి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ షెడ్యూల్‌ను ప్రకటించింది. జాతీయ సెలవులతో పాటు పండగలు, వారాంతపు సెలవులను ఇందులో స్పష్టంగా పేర్కొంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2026లో కూడా గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. అదేవిధంగా ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు మరియు ప్రతి ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవులే. ఈ రోజుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ శాఖలు మూసే ఉంటాయి. అయితే ATMలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం సాధారణంగా అందుబాటులో ఉంటాయి.

హోలీ, ఉగాది, రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి ప్రధాన పండగల రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. ఇవి దేశవ్యాప్తంగా పాటించే పండగలు కావడంతో చాలా రాష్ట్రాల్లో ఒకే రోజున సెలవు ఉంటుంది. అయితే కొన్ని పండగలు చంద్రగణన ఆధారంగా మారుతుండటంతో తేదీల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా ఉండే పండగ సీజన్‌లో ముందస్తుగా పనులు పూర్తిచేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతీయ పండగలు, స్థానిక ప్రాముఖ్యత ఉన్న రోజుల్లో రాష్ట్రాల మధ్య బ్యాంక్ సెలవుల్లో తేడాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కనుమ, శ్రీరామనవమి, వినాయక చవితి వంటి పండగల రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉండే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో బతుకమ్మ, బోనాలు వంటి రాష్ట్ర ప్రత్యేక పండగల సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు. ఈ కారణంగా ఏపీ, తెలంగాణ బ్యాంక్ సెలవుల జాబితా పూర్తిగా ఒకేలా ఉండదు. కాబట్టి 2026లో బ్యాంక్ సంబంధిత పనులు ప్లాన్ చేసుకునే ముందు మీ రాష్ట్రానికి సంబంధించిన అధికారిక హాలిడే లిస్ట్‌ను ఒకసారి పరిశీలించడం చాలా అవసరం. ముందస్తు ప్రణాళికతో అనవసరమైన ఇబ్బందులను తప్పించుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో 2026 బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా..


. జనవరి 15: మకర సంక్రాంతి
. జనవరి 26: గణతంత్ర దినోత్సవం
. మార్చి 3: హోలీ
. మార్చి 19: ఉగాది
. మార్చి 20: రంజాన్ (ఆంధ్రప్రదేశ్‌)
. మార్చి 21: రంజాన్ (తెలంగాణ)
. మార్చి 27: శ్రీరామ నవమి
. ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల ముగింపు
. ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే
. ఏప్రిల్ 14: డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి
. మే 1: మే డే
. మే 27: బక్రీద్
. జూన్ 25: మొహర్రం (ఆంధ్రప్రదేశ్‌)
. జూన్ 26: మొహర్రం (తెలంగాణ)
. జులై నెలలో ప్రత్యేక సెలవులు లేవు
. ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
. ఆగస్టు 25: మిలాద్ ఉన్ నబీ (ఆంధ్రప్రదేశ్‌)
. ఆగస్టు 26: మిలాద్ ఉన్ నబీ (తెలంగాణ)
. సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి
. సెప్టెంబర్ 14: వినాయక చవితి
. అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
. అక్టోబర్ 20: విజయదశమి
. నవంబర్ 24: గురునానక్ జయంతి (తెలంగాణలో మాత్రమే)
. డిసెంబర్ 25: క్రిస్మస్ 

  Last Updated: 27 Dec 2025, 09:42 PM IST