. ఉద్యానవన సాంకేతికతల నుంచి సమగ్ర వ్యవసాయ దిశగా
. దక్షిణ భారతదేశ బలాలపై దృష్టి
. భారతదేశంలో సాంకేతిక మార్పులు
HeartConnect India Expo 2026 : భారత వ్యవసాయ రంగంలో వేగంగా జరుగుతున్న సాంకేతిక మార్పులు కొత్త వ్యాపార అవకాశాలకు వేదికగా హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026 మరోసారి బెంగళూరులో నిర్వహించబడనుంది. ఈ ప్రతిష్టాత్మక ట్రేడ్ ఫెయిర్ అక్టోబర్ 1 నుంచి 3 వరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (BIEC)లో జరగనుంది. మెస్సే మ్యూనిచెన్ ఇండియా బెంగళూరుకు చెందిన హార్టీకనెక్ట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంగా ఈ కార్యక్రమాన్ని సహ-ఆయోజనం చేస్తోంది. ప్రారంభంలో ఉద్యానవన రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ ఎక్స్‌పో ఇప్పుడు తన పరిధిని విస్తరించి విస్తృత వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా ప్రతిబింబించే వేదికగా మారుతోంది. పంటల మధ్య పెరుగుతున్న సాంకేతిక సమన్వయం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారుతున్న వ్యవసాయ విధానాలు ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
హార్టీకనెక్ట్ ఇండియా తొలుత అంతర్జాతీయ స్థాయిలో ఉద్యానవనానికి అంకితమైన ట్రేడ్ ఫెయిర్‌గా గుర్తింపు పొందింది. అయితే కాలక్రమేణా ఉద్యానవనంలో వినియోగించిన అనేక ఆధునిక సాంకేతికతలు రక్షిత సాగు వ్యవస్థలు, ప్రిసిషన్ నీటిపారుదల, వాతావరణ మార్పులను తట్టుకునే ఇన్‌పుట్లు పంటతర్వాత మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఫీల్డ్ క్రాప్స్ మరియు మిశ్రమ వ్యవసాయ విధానాల్లో కూడా విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి. ఈ మార్పును ప్రతిబింబిస్తూ హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026 మొత్తం వ్యవసాయ విలువ గొలుసును ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. రైతులు, సాంకేతిక నిపుణులు, ఎగుమతిదారులు, ఇన్‌పుట్ సరఫరాదారులు మరియు పాలసీ మేకర్లకు ఇది పరస్పర అనుసంధానానికి కీలక వేదికగా నిలవనుంది.
మెస్సే మ్యూనిచెన్ ఇండియా సీఈఓ మరియు మెస్సే మ్యూనిచెన్ అధ్యక్షుడు (భారత్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా) భూపిందర్ సింగ్ మాట్లాడుతూ..ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ప్రదర్శన అనుభవాన్ని స్థానిక బలాలతో కలిపే ప్రయత్నమని తెలిపారు. కర్ణాటకతో పాటు దక్షిణ భారతదేశం ఫ్లోరికల్చర్, ప్రిసిషన్ ఫార్మింగ్, వ్యవసాయ ఎగుమతుల రంగాల్లో వేగంగా ఎదుగుతున్న ప్రాంతాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. హార్టీకనెక్ట్ ఈ ప్రాంతీయ సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హార్టీకనెక్ట్ గ్లోబల్ సభ్యుడు మరియు ఫ్లోరెన్స్ ఫ్లోరా చైర్మన్ ఎస్.కే. గుట్గుటియా మాట్లాడుతూ..వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశామని అన్నారు. ఉద్యానవనంలో మొదట స్వీకరించిన సాంకేతికతలు ఇప్పుడు మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆ మార్పునే హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో ప్రతిబింబిస్తుందని తెలిపారు. 2026 ఎడిషన్‌లో రక్షిత సాగు స్మార్ట్ నీటిపారుదల వాతావరణాన్ని తట్టుకునే ఇన్‌పుట్లు పంటతర్వాత నిర్వహణ వంటి కీలక అభివృద్ధి రంగాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఇవి దేశీయ సరఫరా గొలుసును బలోపేతం చేయడంలోనే కాకుండా భారత వ్యవసాయ ఎగుమతులను మరింత పోటీగలవిగా మార్చడంలో కూడా కీలక పాత్ర పోషించనున్నాయి.
