Site icon HashtagU Telugu

HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!

Hdfc

Hdfc

మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. అయితే, దీర్ఘకాలం పాటు కొనసాగిన వారికే ఈ ఫలాలు లభిస్తాయి. ఇలా గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్  తమ ఇన్వెస్టర్లకు హైరిటర్న్స్ అందించాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ( సిప్) ద్వారా నెల నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. లాంగ్ టర్మ్‌లో భారీ రాబడులు అందించిన టాప్-5 పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులను పట్టించుకోకుండా పెట్టుబడిని కొనసాగిస్తూ ఉండాలి. పది సంవత్సరాల పాటు నెల నెలా సిప్ పెట్టుబడి కొనసాగించిన వారికి ఒకేసారి పెద్ద మొత్తంలో రిటర్న్స్ రావడమే కాదు మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకునే మనోధైర్యాన్ని సైతం ఇస్తుంది. వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం 67ల మిడ్ క్యాప్ ఫండ్స్ గడిచిన 10 ఏళ్లలో సగటున 15.94 శాతం రాబడి అందించాయి. అలాగే ఏఎంఎఫ్‌ఐ ప్రకారం ప్రస్తుతం 20 మిడ్ క్యాప్ ఫండ్స్ పది సంవత్సరాలకు పైగా మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నాయి. అందులో టాప్-5 పథకాలు ఇవే

 

మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిన ఈ మిడ్ క్యాప్ ఫండ్  హైరిటర్న్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాల్లో సిప్ రిటర్న్స్ సగటున ఏడాదికి 23.45 శాతంగా ఉన్నాయి. అంటే రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ.41.71 లక్షలు అవుతుంది. అదే పదేళ్ల లంప్ సమ్ పెట్టుబడి రాబడులు 18.96 శాతంగా ఉన్నాయి. ఇన్వెస్కో ఇండియా మ్యూచువల్ ఫండ్ అందిస్తోన్న మిడ్ క్యాప్ ఫండ్  సైతం హైరిటర్న్స్ ఇచ్చింది. గత 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే సిప్ రాబడులు సగటున ఏడాదికి 23.17 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం రూ.10 వేల నెలవారీ పెట్టుబడితో ఒకేసారి చేతికి రూ.41.10 లక్షలు వచ్చాయి. ఇక లంప్ సమ్ రాబడులు 20.11 శాతంగా ఉన్నాయి. ఎడెల్వాయీస్ మిడ్ క్యాప్ ఫండ్ గత 10 సంవత్సరాల సిప్ రాబడులు సగటున ఏడాదికి 22.79 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారంగా నెలకు రూ.10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుంది. లంప్ సమ్ పెట్టుబడి రాబడులు 19.39 శాతంగా ఉన్నాయి.

 

నిప్పాన్ ఇండియా ఏఎంసీ తీసుకొచ్చిన గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ సిప్ రిటర్న్స్ గత 10 ఏళ్లలో 22.08 శాతంగా ఉన్నాయి. నెలకు రూ.10 వేల చొప్పున ఈ పదేళ్లు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ విలువ ఇప్పుడు రూ.38.66 లక్షలుగా ఉంటుంది. లంప్ సమ్ రాబడులు సగటున వార్షికంగా 18.74 శాతంగా ఉన్నాయి. ప్రముఖ ఏఎంసీల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చిన మిడ్ క్యాప్ ఫండ్  అదరగొట్టింది. గడిచిన 10 ఏళ్లలో వార్షిక రాబడులు సగటున 21.50 శాతంగా ఉన్నాయి. దీని ప్రకారం నెలకు రూ.10 వేలు పెట్టి ఉంటే ఇప్పుడు రూ.37.51 లక్షలు వస్తాయి. లంప్ సమ్ రాబడి సగటున 18.81 శాతంగా ఉంది.

Exit mobile version