Site icon HashtagU Telugu

Gujarat : 200 కోట్ల సంపదను విరాళంగా ఇచ్చి..సన్యాసం స్వీకరించిన గుజరాత్ దంపతులు

Gujarati couple who donated 200 crore wealth and took sannyas

Gujarati couple who donated 200 crore wealth and took sannyas

Gujarat couple: గుజరాత్‌కు చెందిన ఒక సంపన్న జైన దంపతులు.. భవేష్ భండారీ మరియు అతని భార్య దాదాపు ₹200 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతే కాకుండా వారు సన్యాసం కూడా స్వీకరించారు. హిమ్మత్‌నగర్‌కు చెందిన ఈ జంట ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో తమ మొత్తం సంపదను విరాళంగా ఇచ్చారు. ఈ నెలాఖరులో జరిగే ఒక కార్యక్రమంలో త్యజించే జీవితానికి కట్టుబడి ఉన్నారు. వారి 9 ఏళ్ల కుమార్తె మరియు 16 ఏళ్ల కుమారుడు 2022లో సన్యాసం స్వీకరించారు. ఇప్పుడు అదే దారిలో వీరుకూడా నడుస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ జంట ఏప్రిల్ 22న సన్యాసి ప్రతిజ్ఞ చేసిన తరువాత కుటుంబ బంధాలన్నింటినీ తెంచుకుంటారు. మరియు ఎలాంటి ‘భౌతిక వస్తువులు’ ఉంచుకోలేరు. జైన సంప్రదాయం ప్రకారం, వారికి రెండు తెల్లని వస్త్రాలు, భిక్ష కోసం ఒక గిన్నె మరియు “రజోహరన్” ఒక తెల్ల చీపురు వారితో ఉంచుకుంటారు. జైన సన్యాసులు వారు కూర్చునే ముందు ఆ ప్రదేశాన్ని శుద్ది చేసుకుంటారు. అహింస మార్గాన్ని అనుసరిస్తారు.

Read Also: Singham Again : బన్నీని వదిలేసి.. చరణ్‌పై దాడికి సిద్దమవుతున్న సింగం..

ఈ భండారీ దంపతులు మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా వెళ్లి అక్కడ తమ ఆస్తులన్నింటినీ దానం చేశారు. ఊరేగింపు వీడియోలు రథంపై ఉన్న జంట మొబైల్ ఫోన్‌లు మరియు ఎయిర్ కండీషనర్‌లతో సహా తమ వస్తువులను విరాళంగా ఇచ్చారు. ఊరేగింపు వీడియోలో, రాయల్‌ వలే దుస్తులు ధరించిన రథంపై ఈ జంట ఊరేగారు. జైనమతంలో, దీక్ష తీసుకోవడం అనేది ఒక ముఖ్యమైన నిబద్ధత, ఇక్కడ వ్యక్తి భౌతిక సుఖాలు లేకుండా, భిక్షతో జీవిస్తూ.. దేశవ్యాప్తంగా చెప్పులు కూడా లేకుండా వారు తిరుగుతారు.

Read Also: Akbaruddin Owaisi Key Comments : మా బ్రదర్స్ ను హత్య చేస్తారేమో..?

మరోవైపు 2023లో, గుజరాత్‌లోని ఒక మల్టీ మిలియనీర్ డైమండ్ వ్యాపారి మరియు అతని భార్య వారి 12 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించిన తర్వాత ఇపుడు ఈ భండారీ దంపతులు ఇదే విధమైన చర్య తీసుకున్నారు. 2017లో, మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక జంట సుమిత్ రాథోడ్ మరియు అతని భార్య అనామిక- ₹100 కోట్లు విరాళంగా ఇచ్చారు. మరియు వారి మూడేళ్ల కుమార్తెను ఆమె తాతయ్యల వద్ద వదిలి వారు సన్యాసం స్వీరించారు.