Site icon HashtagU Telugu

GST 2.0తో కార్లు బైకులు ధరలు భారీగా తగ్గింపు పూర్తిస్థాయి జాబితా చూడండి

Gst Cut Cars Cheap

Gst Cut Cars Cheap

GST 2.0: దేశంలో ఎంతగానో ఎదురుచూసిన జీఎస్టీ 2.0 నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఆటోమొబైల్ రంగంలో వినియోగదారులకు పెద్ద ఊరట లభించింది. కొత్త పన్ను రేట్ల ప్రకారం వాహన తయారీ సంస్థలు నేరుగా కస్టమర్లకు ధరల తగ్గింపును అందిస్తున్నాయి. చిన్న హాచ్‌బ్యాక్ కార్లపై రూ 40000 నుండి ప్రారంభమై లగ్జరీ ఎస్యూవీలపై రూ 30 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇది భారత ఆటో పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన అతి పెద్ద ధర తగ్గింపుల్లో ఒకటిగా మారింది.

మహీంద్రా బొలెరో నియోపై రూ 1.27 లక్షలు తగ్గింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పెట్రోల్ వేరియంట్ పై రూ 1.40 లక్షలు డీజిల్ పై రూ 1.56 లక్షల తగ్గింపు ఉంది. థార్ మోడల్స్ పై రూ 1.35 లక్షల వరకూ తగ్గించారు. స్కార్పియో క్లాసిక్ మరియు ఎన్ మోడల్స్ పై రూ 1 లక్షకు పైగా తగ్గింపు ఇచ్చారు. ఎక్స్‌యూవీ 700 పై రూ 1.43 లక్షల తగ్గింపు ఉంది.

టాటా మోటార్స్ టియాగోపై రూ 75000 తగ్గింపు ఉంది. టిగోర్ పై రూ 80000 అల్ట్రోజ్ పై రూ 1.10 లక్షలు నెక్సాన్ పై రూ 1.55 లక్షలు తగ్గాయి. హారియర్, సఫారి మోడల్స్ పై కూడా రూ 1.4 లక్షల వరకూ తగ్గింపు లభించింది.

టయోటా ఫార్చ్యూనర్ పై రూ 3.49 లక్షలు లెజెండర్ పై రూ 3.34 లక్షలు హిలక్స్ పై రూ 2.52 లక్షలు కామ్‌రీపై రూ 1.01 లక్షలు తగ్గాయి. ఇన్నోవా క్రిస్టా మరియు హైక్రాస్ మోడల్స్ పై రూ 1.15 లక్షల నుంచి రూ 1.80 లక్షల వరకు తగ్గించారు.

రేంజ్ రోవర్ సంస్థ కార్లలో అత్యధిక తగ్గింపు కనిపిస్తుంది. 4.4P SV LWB మోడల్ పై రూ 30.4 లక్షలు తగ్గింది. డిఫెండర్ సిరీస్ లో రూ 18.6 లక్షల వరకు తగ్గింపు ఉంది. డిస్కవరీ మోడల్ పై రూ 9.9 లక్షలు తగ్గించారు.

కియా కార్నివల్ పై రూ 4.48 లక్షలు సోనెట్ పై రూ 1.64 లక్షలు సెల్టోస్ పై రూ 75000 క్యారెన్స్ క్లావిస్ పై రూ 78000 తగ్గింపు ఉంది.

స్కోడా కోడియాక్ పై రూ 5.8 లక్షల వరకు తగ్గింపు ఉంది. కుశాక్ మరియు స్లావియా మోడల్స్ పై కూడా జీఎస్టీ తగ్గింపు తో పాటు ఫెస్టివల్ ఆఫర్లతో మంచి డిస్కౌంట్లు ఇచ్చారు.

హ్యూండై గ్రాండ్ i10 నియోస్ పై రూ 73808 ఔరా పై రూ 78465 వెన్యూ పై రూ 1.23 లక్షలు క్రేటా పై రూ 72000 ఆల్కజార్ పై రూ 75000 ట్యూసాన్ పై రూ 2.4 లక్షల వరకు తగ్గించారు.

రెనో కిగర్ పై రూ 96395 తగ్గించారు. మారుతి సుజుకి కార్లు అల్టో K10 పై రూ 40000 స్విఫ్ట్ పై రూ 58000 డిజైర్ పై రూ 61000 బ్రెజ్జా పై రూ 78000 ఇన్విక్టో పై రూ 2.25 లక్షల తగ్గింపు ఉంది.

నిస్సాన్ మ్యాగ్నైట్ వేరియంట్లు రూ 1 లక్ష వరకు తగ్గాయి. CNG కిట్ ధరను కూడా రూ 3000 తగ్గించారు.

హోండా కార్లు అమెజ్ పై రూ 72500 నుంచి రూ 95500 వరకు తగ్గాయి. ఎలివేట్ మరియు సిటీపై సగటుగా రూ 58000 వరకు తగ్గింపులు ఉన్నాయి.

టూ వీలర్ విభాగంలో 350సీసీ లోపు బైక్ లపై జీఎస్టీ రేటు 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో బడ్జెట్ వినియోగదారులకు ఇది పెద్ద ఊరట. హోండా టూ వీలర్లు మీద రూ 18887 వరకు తగ్గింపులు ఉన్నాయి. యాక్టివా 110 పై రూ 7874 డియో 110 పై రూ 7157 షైన్ మోడల్స్ పై సగటున రూ 7000 పై చొప్పున తగ్గించారు. CB125 హార్నెట్, యూనికోర్న్, SP160, హార్నెట్ 2.0, NX200, CB350 మోడల్స్ పై రూ 9000 నుంచి రూ 18000 వరకు తగ్గింపులు ఉన్నాయి.

హీరో స్ప్లెండర్ బజాజ్ పల్సర్ టీవీఎస్ అపాచె రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లాంటి ప్రముఖ బైకులు కూడా ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతాయి. దీని వల్ల పండుగల కాలంలో వాహనాల అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపించే అవకాశం ఉంది.

Exit mobile version