Gold Rates Today: నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్లతో పాటు 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
పసిడి ప్రేమికులకు భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ ప్రభావంతో హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్లతో పాటు 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. సోమవారం బంగారం ధరలు చెప్పుకోదగిన స్థాయిలో తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,910గా ఉంది (Gold and Silver Rates). గత సెషన్‌తో పోల్చకుంటే పది గ్రాములకు రూ.1420 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,000గా ఉంది (Live Gold Rates). గత సెషన్‌తో పోల్చకుంటే పది గ్రాములకు రూ.1300 మేర తగ్గింది.
