Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మళ్లీ దిగొచ్చిన బంగారం

బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణను పక్కనపెట్టి మళ్లీ దాడులు చేసుకోవడం ఇప్పుడు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయన్న అంచనాలు, డాలర్ పుంజుకోవడం సహా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలు భారీగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. గ్లోబల్ బులియన్ […]

Published By: HashtagU Telugu Desk
Good news for gold lovers... Gold prices have dropped again.

Good news for gold lovers... Gold prices have dropped again.

బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణను పక్కనపెట్టి మళ్లీ దాడులు చేసుకోవడం ఇప్పుడు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయన్న అంచనాలు, డాలర్ పుంజుకోవడం సహా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు బంగారం ధరలు భారీగా పడిపోవడానికి కారణమవుతున్నాయి. గ్లోబల్ బులియన్ మార్కెట్‌తో పాటు దేశీయంగానూ పసిడి రేట్లు భారీగా పతనమవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జూన్ 30వ తేదీ మంగళవారం రోజున 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సునా 39 డాలర్ల మేర పడిపోయి 4000 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు 3983 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సునా 1.19 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం వెండి ఔన్సు రేటు 57 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు మళ్లీ తగ్గాయి. వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల బంగారం రేటు రెండ్రోజుల్లో రూ.3800 వరకు పడిపోయింది. ఈరోజు 10 గ్రాముల బంగారం రేటు రూ.1800 మేర పడిపోవడంతో తులం బంగారం రూ.1,40,130 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రేటు ఈరోజు మరో రూ.1650 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,28,450 వద్దకు దిగివచ్చింది.

బంగారంతో పాటు వెండి రేటు సైతం దిగివస్తుందని అంచనా వేసినా అందుకు భిన్నంగా స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు గత నాలుగు రోజులుగా స్థిరంగానే ఉంది. ఈరోజు కిలో వెండి రేటు రూ.2,45,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

 

  Last Updated: 30 Jun 2026, 11:38 AM IST