Gold Price ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న వేళ రిటైల్ మార్కెట్లలో బంగారం, వెండి రేట్లు రోజురోజుకూ తగ్గుతూ పోతున్నాయి. స్పాట్ మార్కెట్లో రేట్లు పేపర్ మీద పెరుగుతున్నప్పటికీ రిటైల్ పై ఆ ప్రభావం అస్సలు కనిపించటం లేదు. ప్రజలు రేట్ల పెంపు ఆందోళనలో ఉన్న వేళ అనూహ్యంగా పతనం కొనసాగటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా తమ ప్రాంతంలోని రిటైల్ రేట్లను పరిశీలించటం మంచిది.
మార్చి 4న బంగారం రేట్లు భారీగా తగ్గి ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో మార్చి 3 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.311 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 451గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 080గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే మార్చి 4, 2026న రేటు కేజీకి రూ.10వేలు తగ్గింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 95వేల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.295 వద్ద ఉంది.
