Gold Vs Big Fall : బంగారం ధరలు మండిపోతున్నాయి. నేటి సమాచారం ప్రకారం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 85,600. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 93,380. రూ.90వేల రేంజులో ఉన్న బంగారం రేటు రూ.56వేలకు డౌన్ అవుతుందంటే ఎవరైనా నమ్ముతారా ? అస్సలు నమ్మరు !! నమ్మశక్యంగా లేదు కానీ.. ఈ దిశగా ఒక ప్రచారమైతే జరుగుతోంది. జాతీయ మీడియాలో కథనాలైతే వస్తున్నాయి. రాబోయే కొన్నేళ్లలో బంగారం రేట్లు 10 గ్రాములకు రూ.56వేల రేంజుకు పతనం అవుతాయని ఆ కథనాల్లో జోస్యం చెబుతున్నారు. వివరాలు చూద్దాం..
Also Read :Congress Plan : మోడీ కంచుకోటలో కాంగ్రెస్ కొత్త స్కెచ్
రాబోయే ఆరేళ్లలో రూ.55వేలకు..
కునాల్ కపూర్.. భారత సంతతి వ్యక్తి. అమెరికాలో ఉన్న ‘మార్నింగ్‌స్టార్’(Gold Vs Big Fall) అనే ఆర్థిక సేవల కంపెనీకి ఈయన సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీకి చెందిన విశ్లేషకుడు జాన్ మిల్స్ బంగారం రేటు రూ.56వేలకు డౌన్ అవుతుందనే విశ్లేషణను అమెరికా మీడియా వేదికగా వెలువరించారు. దీని ఆధారంగా భారత మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నారు. రాబోయే ఐదారు సంవత్సరాల్లో భారత్‌లో బంగారం ధరలు 38 శాతం మేర తగ్గుతాయని ‘మార్నింగ్‌స్టార్’ అంచనా వేసింది. తద్వారా 10 గ్రాముల బంగారం ధర రూ.90వేల రేంజు నుంచి రూ.55వేల రేంజుకు తగ్గిపోతుందని పేర్కొంది. రాబోయే ఆరేళ్లలో విడతల వారీగా ఈ తగ్గుదల చోటుచేసుకుంటుందని తెలిపింది.
గోల్డ్ రేటు ఎందుకు తగ్గుతుంది ?
- బంగారం రేటు రూ.56వేల రేంజుకు ఎందుకు తగ్గుతుంది ? అనే దానికీ ‘మార్నింగ్‌స్టార్’కు చెందిన జాన్ మిల్స్ కొన్ని కారణాలను చూపించారు.
- ‘‘బంగారం సప్లై గతంతో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా పెరిగింది. దీనివల్లే రాబోయే కొన్నేళ్లలో గోల్డ్ రేట్లు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం నిల్వలు 9 శాతం మేర పెరిగి 216,265 టన్నులకు చేరాయని మనం గుర్తుంచుకోవాలి’’ అని జాన్ మిల్స్ తెలిపారు.
- ‘‘2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గోల్డ్ మైనింగ్ కంపెనీల లాభాలు ఔన్సుకు 950 డాలర్ల స్థాయికి పెరిగాయి. అంతకుమించిన లాభాలను ఆయా కంపెనీలు ఆశించలేవు. అందుకే బంగారం రేట్లను తగ్గించే దిశగా ఆలోచన చేసే అవకాశం ఉంది’’ అని జాన్ మిల్స్ అంచనా వేశారు.
- ‘‘భారత్‌కు ఆర్‌బీఐ ఉన్నట్టే.. ప్రతీ దేశానికి ఒక కేంద్ర బ్యాంకు ఉంటుంది. ప్రపంచంలోని 71 శాతం కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను తగ్గించుకోవడమో లేదా ప్రస్తుత స్థాయులను కొనసాగించడమో చేయాలని అనుకుంటున్నాయి. అంటే అదనపు బంగారాన్ని సేకరించే ఆలోచన వాటికి లేదు. దీనివల్ల బంగారం డిమాండ్ తగ్గుతుంది’’ అని జాన్ మిల్స్ పేర్కొన్నారు.