Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం, వెండి ధర లు గత 4 రోజులు భారీగా దిగొచ్చినా ఇప్పుడు మాత్రం మళ్లీ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇప్పుడు దేశీయంగా, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 పెరిగి తులం రూ. 1,33,900 వద్ద కొనసాగుతోంది. దీనికి ముందు వరుసగా […]

Published By: HashtagU Telugu Desk
Good news for gold lovers: Gold prices have dropped sharply.

Good news for gold lovers: Gold prices have dropped sharply.

పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం, వెండి ధర లు గత 4 రోజులు భారీగా దిగొచ్చినా ఇప్పుడు మాత్రం మళ్లీ గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇప్పుడు దేశీయంగా, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయనేది చూద్దాం. దేశీయంగా చూస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 200 పెరిగి తులం రూ. 1,33,900 వద్ద కొనసాగుతోంది. దీనికి ముందు వరుసగా 4 రోజులు రేటు తగ్గడం విశేషం. వరుసగా రూ. 3350, రూ. 1450, రూ. 250, రూ. 150 మేర తగ్గుతూ వచ్చింది. ఇలా వరుసగా 4 రోజుల వ్యవధిలో గోల్డ్ రేటు రూ. 5200 తగ్గుముఖం పట్టింది.

ఇదిలా ఉండగా ఇదే సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 220 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,46,080 వద్ద ట్రేడవుతోంది. ఇది అంతకుముందు వరుసగా 4 రోజుల్లో రూ. 3650, రూ. 1590, రూ. 270, రూ. 160 చొప్పున తగ్గింది. ఇక బంగారం ధర స్వల్పంగా పెరిగినా మరోవైపు వెండి రేటు స్థిరంగానే ఉంది. హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు రూ. 2.55 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు చూస్తే సిల్వర్ రేటు వరుసగా రూ. 15 వేలు, రూ. 5 వేలు, రూ. 5 వేలు చొప్పున తగ్గింది. ఇలా వరుసగా 4 రోజుల్లో రూ. 25 వేల మేర తగ్గడం విశేషం.

దేశీయంగా ఇలా ఉన్నప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఫ్లాట్‌గానే ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4159 డాలర్ల వద్ద ఉంది. కిందటి రోజు ఒక దశలో ఇంట్రాడేలో 4130 డాలర్ల స్థాయికి కూడా పడిపోయింది. సిల్వర్ రేటు చూస్తే 65 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పుంజుకుంది. ప్రస్తుతం రూపాయి విలువ రూ. 94.36 వద్ద ఉంది.

కొద్ది రోజుల కిందట పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ డీల్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా తగ్గగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించలేదు. ఇంకా భవిష్యత్తులో పెంచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. దీంతో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక వరుసగా తగ్గగా ఇవాళ స్వల్పంగా పెరిగాయి.

  Last Updated: 20 Jun 2026, 11:25 AM IST