Gold Price: బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరగడంతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే

బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ షాకులు తగులుతున్నాయి. ఇటీవల వరుసగా భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి చాలా దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా, ఇంకా అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే కిందటి రోజుతో పోలిస్తే మళ్లీ 2 శాతం వరకు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు కిందటి రోజు ఒక […]

Published By: HashtagU Telugu Desk
Gold prices have risen; following today's hike, here is the level the rate has reached.

Gold prices have risen; following today's hike, here is the level the rate has reached.

బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ షాకులు తగులుతున్నాయి. ఇటీవల వరుసగా భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి చాలా దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా, ఇంకా అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే కిందటి రోజుతో పోలిస్తే మళ్లీ 2 శాతం వరకు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు కిందటి రోజు ఒక దశలో 4 వేల డాలర్ల దిగువన ఉండగా ఇప్పుడు అది మళ్లీ 4090 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇదే సమయంలో సిల్వర్ రేటు కూడా 56 డాలర్ల స్థాయి నుంచి 59 డాలర్లకు ఎగబాకింది.

ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగానే దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. జూన్ 26న ఉదయం ఒక దశలో తగ్గినట్లు కనిపించినా, ఉదయం 10 గంటల తర్వాత ఒక్కసారిగా పెరిగాయి. కిందటి రోజు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1300 పెరగగా, ఇప్పుడు అంటే జూన్ 27న ఉదయం 10 గంటల సమయంలో మరో రూ. 1100 పెరిగింది. దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు హైదరాబాద్ నగరంలో రూ. 1,31,950 వద్ద ట్రేడవుతోంది.

అంతకుముందు మాత్రం వరుసగా తగ్గాయన్న సంగతి తెలిసిందే. జూన్ 23, 24, 25 తేదీల్లో చూస్తే వరుసగా రూ. 3100, రూ. 1550, రూ. 1450 ఇలా 3 రోజుల్లోనే రూ. 6 వేలకు పైగా పతనమైంది. తర్వాత మళ్లీ 2 రోజుల్లోనే రూ. 2400 మేర పెరిగింది. అయినా గరిష్ఠ స్థాయితో పోలిస్తే, ఇదే సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర హైదరాబాద్ నగరంలో ఇప్పుడు చూస్తే రూ. 1200 పెరిగి 10 గ్రాములకు రూ. 1,43,950 వద్ద కొనసాగుతోంది. దీనికి ముందటి రోజు రూ. 1420 మేర పెరిగింది.

బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా ఇదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. జూన్ 26న రూ. 15 వేలు పెరగగా ఇవాళ స్థిరంగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీకి రూ. 2.45 లక్షలుగా ఉంది. ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే మళ్లీ పెరుగుతున్నాయి.

  Last Updated: 27 Jun 2026, 10:51 AM IST