భారత్‌లో బంగారం (Gold) అంటే ప్రత్యేకమైన గౌరవం. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు తప్పనిసరిగా చేస్తుంటారు. మొన్నటి వరకు బంగారం ధరలు గణనీయంగా పెరుగుతూ, తులం రేటు లక్ష రూపాయల మార్క్‌ను దాటి కొనుగోలుదారులకు భారం అయ్యింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగినా, గత వారంతో పోలిస్తే ఇప్పటికీ దిగాయి. ఔన్సుకు పసిడి రేటు $17.63 పెరిగి $3330కి చేరింది. అంతేగాక స్పాట్ సిల్వర్ ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఇదే సమయంలో భారత రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ.87.05కి పడిపోయింది. ఇది దిగుమతులపై ప్రభావం చూపించినా, ధరలు ఇంకా నియంత్రణలోనే ఉన్నాయి.
Jagan : కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్న జగన్
జూలై 30వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.99,820గా ఉంది. ఇది గత వారం కంటే రూ.2,600 వరకు తక్కువ. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,500కి చేరింది. ఇది వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గిన పరిస్థితి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన ఈ సమయంలో ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశం.
బంగారం ధరల తో సమానంగా వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,26,000గా ఉంది. మూడు రోజులుగా వెండి ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,16,000గా ఉంది. బంగారం, వెండి ధరల్లో ఈ స్థిరత్వం కొనుగోలు వాతావరణాన్ని మెరుగుపరుస్తోంది.