Gold Prices : ఐదేళ్లలో డబుల్ అయిన గోల్డ్ రేట్లు.. నెక్ట్స్ ఏంటి ?

ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం రేటు(Gold Prices) రూ.74వేల రేంజులో ఉంది.

Published By: HashtagU Telugu Desk
Gold Rates

Gold Prices : ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం రేటు(Gold Prices) రూ.74వేల రేంజులో ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.68వేల రేంజులో ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం రేట్లు పెరుగుతూ పోయాయి. స్టాక్ మార్కెట్లు కూడా జూమ్ అయ్యాయి. ఇకపై గోల్డ్ రేంజు ఏమిటి ? ఈ ఏడాది చివరికల్లా బంగారం ధరలు ఎక్కడికి చేరొచ్చు ? దీనిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ప్రజలు బంగారంపై అపారమైన నమ్మకం ఉంచుతున్నారు. అందుకే దాని కొనుగోలుకు ప్రయారిటీ ఇస్తున్నారు. తమ పెట్టుబడులలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్‌తో పాటు బంగారంపైనా పెట్టుబడి పెడుతున్నారు. ఈవిధంగా ఆలోచించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే బంగారం కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి స్టాక్ చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో గోల్డ్ లభ్యత తగ్గిపోయి.. ధర పెరుగుతోంది. దేశ కరెన్సీ విలువను కాపాడుకునేందుకు.. కేంద్ర బ్యాంకుల వద్ద తగినంత బంగారం నిల్వలు ఉండటం తప్పనిసరి. అందుకే మన దేశ రిజర్వ్ బ్యాంకు సహా చాలా దేశాల కేంద్ర బ్యాంకులు గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ఈవిషయంలో అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్  మనకంటే ముందంజలో ఉన్నాయి. ఈ కారణాలతో గత ఐదేళ్లలో మన దేశంలో బంగారం రేటు డబుల్ అయింది. 2003 సంవత్సరం నాాటి రేటుతో పోలిస్తే.. ఇప్పటివరకు గోల్డ్ ధర దాదాపు 1000 శాతం పెరిగింది. అంటే బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు లాభాల్లో ఉన్నారన్న మాట.

Also Read :Ashadha Masam : ఆషాఢ మాసంలోని పర్వదినాల గురించి తెలుసా ?

త్వరలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది తమ పెట్టుబడుల్లో దాదాపు 12 శాతాన్ని బంగారం కోసం కేటాయిస్తున్నారు. స్టాక్ మార్కెట్లతో(Stock Markets) పోలిస్తే రిస్క్  తక్కువగా ఉన్నందున రానున్న రోజుల్లో బంగారంపై పెట్టే పెట్టుబడులను దాదాపు 15 శాతానికి పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు చాలా హై రేంజులో ఉన్నాయి. ఈనెలలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ల గతి మారే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ అక్కడ భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటే.. చాలామంది తమ పెట్టుబడులను గోల్డ్ వైపు మళ్లించేందుకు ఆసక్తి చూపనున్నారు.

Also Read :e-Cigarettes: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతున్న ఈ సిగ‌రెట్లు..!

  Last Updated: 07 Jul 2024, 08:28 AM IST