Site icon HashtagU Telugu

Gold Price Today : వామ్మో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర

Gold Pric

Gold Pric

Gold Price Today September 14, 2024 : నెల రోజుల క్రితం బంగారం ధరలు (Gold Price ) భారీగా తగ్గగా..ఈ నెలలో మాత్రం పెరుగుతూ కొనుగోలు ధరలకు చుక్కలు చూపిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఒక్క రోజే ఏకంగా రూ.1200 ల వరకు పెరిగి భారీ షాక్ ఇచ్చాయి. దేశీయంగా కొనుగోళ్లు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉండటంతో బంగారం ధరలు పెరుగుతూ వస్తుంది.

శుక్రవారం ఒకేరోజు దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో తులం బంగారం ధర రూ.1,200 ఎగబాకి రూ.75,550 గా ఉంది. దీంతో గత రెండు నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అంతకుముందు ఇది రూ.74,350 వద్ద ఉంది. హైదరాబాద్‌ (Hyderabad)బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.1,300 ఎగబాకి రూ.74,450కి చేరుకోగా, 22 క్యారెట్‌ ధర రూ.1,200 అందుకొని రూ.68,250 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 2,599.70 డాలర్లు పలుకగా, వెండి 30.47 డాలర్ల వద్ద ఉంది.

ఇక బంగారంతోపాటు వెండి మరింత పరుగులు పెట్టింది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి శుక్రవారం మరో అడుగుముందుకేసింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.2,000 ఎగబాకి రూ.89 వేలకు చేరుకున్నట్లు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది.

ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలు (Looking at Gold Prices in Major Cities) చూస్తే..

* హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
* విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.
* ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.74,950గా ఉంది. కిలో వెండి ధర రూ.87,200గా ఉంది.

Read Also :  Sitting Long Hours: మీరు గంట‌ల త‌ర‌బడి కుర్చీలో కూర్చుంటున్నారా..?