గత కొద్దీ రోజులుగా లక్షకు పైగా ఉన్న గోల్డ్ ధరలు (Gold Price) ఈరోజు లక్ష రూపాయల లోపునకు చేరడం పసిడి ప్రియులకు శుభవార్తగా మారింది. జూలై 27, 2025 ఉదయం సమాచారం ప్రకారం దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.540 తగ్గి రూ.99,930కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.91,600గా నమోదైంది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ.1,900 తగ్గి, పలు నగరాల్లో రూ.1,16,000 నుండి రూ.1,26,000 మధ్య నమోదైంది.
హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,930గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.91,600గా నమోదైంది. ఢిల్లీ మాత్రం కొంచెం ఎక్కువగా ఉండి రూ.1,00,080గా ఉంది. వెండి ధరల్లోనూ స్వల్ప వ్యత్యాసం ఉంది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి రూ.1,26,000గా ఉంటే, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో అది రూ.1,16,000గా ఉంది. ఈ వ్యత్యాసాలకు కారణంగా స్థానిక పన్నులు, రవాణా వ్యయం, మార్కెట్ డిమాండ్ ప్రభావం చూపుతుంటుంది.
Iran Terror Attack: ఇరాన్‌లోని భవనంపై దాడి.. 9 మంది మృతి, పాకిస్థాన్ హస్తం ఉందా?
అమెరికన్ డాలర్ బలపడటంతో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి, ఎందుకంటే బంగారం డాలర్‌తో విలోమానుపాతంలో ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచిన విషయం కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైంది. బంగారం లాంటి దిగుబడి లేని ఆస్తులపై పెట్టుబడి ఆపేక్ష తగ్గుతుంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఈ ధోరణిని బలపరిచాయి.
వెండి ధరలు ముఖ్యంగా పారిశ్రామిక డిమాండ్ తగ్గడం వల్ల ప్రభావితమయ్యాయి. వెండి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, సోలార్, ఆటోమొబైల్ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తారు. గ్లోబల్ మార్కెట్‌లో ఉత్పత్తి మందగించడం, పారిశ్రామిక వినియోగం తగ్గిపోవడం వల్ల వెండి డిమాండ్ క్షీణించిందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో వెండి ధరలు కూడా బంగారం ధరకే అనుసంధానంగా క్షీణించాయి. తాజా ధరల తగ్గుదల నేపథ్యంలో కొనుగోలుదారులు మళ్లీ బంగారం, వెండి కొనుగోళ్లకు మొగ్గుచూపే అవకాశం ఉంది.