జూలై 26 (శనివారం) నాటికి బంగారం ధరలు (Gold) స్వల్పంగా తగ్గినప్పటికీ, అవి ఇంకా ఆల్ టైం హయ్యెస్ట్ స్థాయికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,01,290 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,500 పలికింది. దీంతో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఈ ధరలు భారీ భారం అని చెప్పడం లో ఎలాంటి సందేహాలు లేవు. ముఖ్యంగా వివాహాలు, పండుగల నేపథ్యంలో బంగారు ఆభరణాల కొనుగోలుకు సిద్ధమవుతున్నవారికి ఇది కాస్త కలత కలిగించే అంశం.
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత కారణంగా చూస్తున్నారు. స్టాక్ మార్కెట్లలోని నెగెటివ్ సెంటిమెంట్, డాలర్ విలువలో సంభవిస్తున్న భారీ పతనం, అలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేపట్టిన వాణిజ్య విధానాలు, గ్లోబల్ అన్‌సర్టెంటీ వంటి అంశాలు బంగారం ధరను పైకి నెట్టుతున్నాయి. డాలర్ విలువ పడిపోతే, బంగారం విలువ పెరగడం సాధారణ పరిణామం. అదే ఇప్పుడు భారత్‌లోనూ కనిపిస్తోంది.
Kadapa : జగన్ అడ్డాలో కమలం కసరత్తులు
ఈ స్థాయిలో బంగారం ధరలు పెరగడం వల్ల, వినియోగదారులు కొనుగోలు విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారం ధూపం, నాణ్యత, హాల్‌మార్క్ ధ్రువీకరణ వంటి అంశాల్లో రాజీ పడకూడదని హెచ్చరిస్తున్నారు. ధర పెరిగిన నేపథ్యంలో కొంచెం తేడా వచ్చినా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల మదుపర్లు, వినియోగదారులు ప్రామాణిక షాపులనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
ఇక మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఒక కేజీ వెండి ధర రూ.1,28,000గా నమోదైంది. ఇది గతకాలపు ధరలతో పోల్చితే అత్యంత అధికం. వెండి ధరలు పెరగడానికి పారిశ్రామిక వాడకంలో పెరిగిన డిమాండ్ ప్రధాన కారణంగా చెబుతున్నారు. వెండి వినియోగం అనేక రంగాల్లో పెరుగుతున్న నేపథ్యంలో, దీని ధరలు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో వెండి మదుపు చేయాలనే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి.