Gold Price Today: పసిడి ప్రియులకు భారీ శుభవార్త..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా భారీగా పెరుగుతూ ఆందోళన కలిగించినా ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా మాత్రం బంగారం రేట్లు దిగివచ్చి ఊరట కల్పించాయి. ఈ క్రమంలో మే 8వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం. […]

Published By: HashtagU Telugu Desk
Gold prices drop—a great opportunity for buyers.

Gold prices drop—a great opportunity for buyers.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా భారీగా పెరుగుతూ ఆందోళన కలిగించినా ఈరోజు పసిడి రేట్లు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన క్రమంలో బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా మాత్రం బంగారం రేట్లు దిగివచ్చి ఊరట కల్పించాయి. ఈ క్రమంలో మే 8వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.

ఎట్టకేలకు బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలవడం, ఆ వెంటనే ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపేయడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగా ఉంది. యూఏఈ, అమెరికా నౌకలే లక్ష్యంగా ఇటీవలే ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ నౌకలపై అమెరికా సైతం దాడులు చేపట్టింది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హార్ముజ్‌లో అమెరికా చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపేయడం, ఉద్రిక్తతలు తగ్గడం వంటి పరిణామాలతో బంగారం ధరలు దిగివచ్చినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా తగ్గడం కూడా పసిడి రేట్లు తగ్గేందుకు కారణమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మే 8వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్ల పెరుగుదలకు రెండ్రోజుల తర్వాత బ్రేకులు పడ్డాయి. భారీగా పెరిగి బెంబేలెత్తించిన పసిడి ధరలు ఈరోజు దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 320 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,52,680 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల నగల బంగారం రేటు తులంపై రూ.300 తగ్గింది. దీంతో 10 గ్రాములకు రూ.1,39,950 వద్దకు తగ్గింది.

అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఈరోజు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 17 డాలర్ల వరకు పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4715 డాలర్లు దాటింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు 0.14 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ ధర 79.78 డాలర్ల వద్ద ఉంది.

బంగారం ధరలు దిగివచ్చినప్పటికీ వెండి రేటు మాత్రం తగ్గలేదు. ఈరోజు వైట్ మెటల్ రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ధర రూ. 2,75,000 మార్క్ వద్దే అమ్ముడవుతోంది.

దక్షిణ భారత్‌లో ప్రముఖ జువెలరీల్లో ఒకటైన లలితా జువెలరీలో ఈరోజు బంగారం ధరలు: 22 క్యారెట్ల పసిడి రేటు 1 గ్రాముకు రూ.13,995 వద్ద ఉంది. సిల్వర్ రేటు 1 గ్రాముకు రూ.280 వద్ద అమ్ముడవుతోంది. ప్లాటినం గ్రాముకు రూ.7,652 వద్ద ఉంది.

మే 8వ తేదీన తనిష్క్ జువెలరీల్లో 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు 1 గ్రాముకు రూ.14,070 వద్ద ఉంది. క్రితం రోజుతో పోలిస్తే గ్రాముకు రూ.80 మేర పెరిగింది. ఇక తులం బంగారం రేటు చూస్తే రూ.1,40,700 వద్ద అమ్ముడవుతోంది.

  Last Updated: 08 May 2026, 10:43 AM IST