ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం & వెండి ధరలు, ఈరోజు తులం ఎంత ఉందొ తెలుసా?

గత కొద్దీ రోజులుగా బంగారం , వెండి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు (డిసెంబర్ 15) తులం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,34,730 ఉంది. పండగల సీజన్ వస్తున్న తరుణంలో బంగారం ధరలు పెరుగుతుండడం కొనుగోలుదారులకు ఇబ్బందిగా మారింది.

Published By: HashtagU Telugu Desk
gold and silver rate today

gold and silver rate today

  •  ఈరోజు భారీగా పెరిగిన బంగారం & వెండి ధరలు
  •  తులం 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,34,730
  •  బంగారం ధర మాదిరిగానే వెండి ధర కూడా భారీగా పెరిగింది

Gold Price Today : బంగారం మరియు వెండి ధరలు దేశీయ మార్కెట్‌లో నిరంతరంగా పెరుగుతూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా రూ.820 పెరిగి రూ.1,34,730కు చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా రూ.750 ఎగబాకి రూ.1,23,500 పలుకుతోంది. కొనుగోలుదారులకు ఈ పెరుగుదల పెద్ద షాక్‌గా మారింది.

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఒక్కరోజే రూ.3,000 పెరిగి రూ.2,13,000 మార్క్‌ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, మరియు ద్రవ్యోల్బణం భయాల కారణంగానే ఈ బులియన్ లోహాల ధరలు అత్యధిక స్థాయికి చేరుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ధరల పెరుగుదల కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు ధృవీకరించాయి.

 

బంగారం & వెండి ధరలు

నిపుణుల అంచనా ప్రకారం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ క్షీణించడం, బాండ్ ఈల్డ్స్‌పై ఒత్తిడి పెరగడం మరియు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లేలా చేస్తున్నాయి. దీని కారణంగానే దేశీయంగా పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ, పెరుగుతున్న ధరల వల్ల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ధరల ధోరణి కొనసాగవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  Last Updated: 15 Dec 2025, 11:59 AM IST