Gold Rate: ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎవరూ ఊహించని రీతిలో తగ్గాయి. శనివారం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 980 తగ్గగా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.900 తగ్గింది. మరోవైపు కిలో వెండిపై రూ. 4వేలు తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో గడిచిన రెండు రోజుల్లో (శుక్ర, శనివారం) 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ.2800 తగ్గింది. వెండి ధర రూ.8వేలు తగ్గుదల చోటు చేసుకుంది. అయితే, బంగారం ఉన్నట్లుండి తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు భారతదేశంలో గోల్డ్ రేటు తగ్గడానికి కారణమవుతున్నాయి.
Also Read: Telangana Govt: రేవంత్ సర్కార్ న్యూ ప్లాన్.. ఇందిరమ్మ ఇండ్లు ఇక వేగవంతం..
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గత ఏడాది వ్యవధిలో బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణంగా ఇదే. అయితే, ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల విక్రయాలు దాదాపు 70శాతం క్షీణించినట్లు, పాత ఆభరణాల మార్పిడితో కొత్తవి తీసుకోవడం పెరిగిందని విక్రేతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్ లు అమల్లోకి వస్తుండగా.. పసిడి గరిష్ఠ ధరలు నిలబడవనే అంచనాతో ఇన్వెస్టర్లు ఈ లోహాల్లోనూ లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు సమాచారం. దీంతో గోల్డ్ రేటు అమాంతం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: CM Revanth Reddy : హెచ్‌సీయూ భూములపై ‘ఏఐ’తో దుష్ప్రచారం.. సీఎం సీరియస్
ఏప్రిల్ నెలాఖరు, మే నెలలో బంగారం ధర మరింత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఫలించి యుద్ధ విరమణ చోటుచేసుకుంటే పసిడి ధర మరింతగా దిగొస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అత్యవసరం అనుకున్నవారు మినహా మిగిలిన వారు బంగారం కొనుగోలు చేసే ముందు అంతర్జాతీయ మార్కెట్‌లలో పరిస్థితిని తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.