బంగారం ధరల్లో ఈరోజు అనూహ్య పతనం నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600గా నమోదైంది. దీని వల్ల పండుగల సీజన్‌లో బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో, మార్కెట్లో డిమాండ్ కొంతమేర పెరిగే అవకాశం ఉందని బంగారపు వ్యాపారులు చెబుతున్నారు.
‘S-400’ : రూ.10వేల కోట్లతో ‘S-400’ కొనుగోలు
నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర $245 తగ్గడం ఈ పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకున్న తాజా నిర్ణయాలు, డాలర్ బలపడడం, అలాగే మధ్యప్రాచ్యంలో ఉత్కంఠత కొంత తగ్గడం వంటి అంశాలు గ్లోబల్ గోల్డ్ రేట్లపై ప్రభావం చూపాయి. బంగారం అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతే, భారత బులియన్ మార్కెట్లో కూడా వెంటనే దాని ప్రభావం కనబడుతుంది. అదే విధంగా రూపాయి విలువలో స్థిరత్వం ఉండటంతో, ఈ తగ్గుదల మరింత స్పష్టంగా కనిపించిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా, వెండి ధరలు కూడా కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాదులో కిలో వెండి ధర రూ.1,81,900 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు అయిన విజయవాడ, విశాఖపట్నం, వారంగల్‌లలో కూడా ఇదే తరహా ధరలు నమోదయ్యాయి. నిపుణులు చెబుతున్నట్లుగా, గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులు స్థిరంగా ఉంటే వచ్చే వారాల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని, ఇది ఆభరణాల కొనుగోలుదారులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే, పెట్టుబడిదారులు మాత్రం ఈ తగ్గుదల తాత్కాలికమై ఉండొచ్చని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.