పది రోజులుగా రాకెట్ స్పీడ్తో తో పరుగులు పెట్టిన బంగారం ధరలు (Gold Price) చివరికి కొంత తగ్గుముఖం పట్టాయి. వరుసగా 5 రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు, నేడు స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించింది. హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.87,550గా నమోదైంది. ఇదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గి రూ.95,510కు చేరింది.
Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు
బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,09,900గా పలుకుతోంది. పెరుగుతున్న ధరలతో బంగారం కొనుగోలు నుంచి వెనక్కి తగ్గిన వినియోగదారులు ఇప్పుడు మళ్లీ మార్కెట్ వైపు చూస్తున్నారు. ఇది బులియన్ వ్యాపారులకు కొంత ఊరటను తీసుకొచ్చింది.
మొత్తంగా చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువల మార్పులు, వడ్డీ రేట్లపై అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు తదితర అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అయితే తాజా తగ్గుదల తాత్కాలికమా లేక స్థిరమా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. కాగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలుదారుల ఆసక్తి మరింత పెరిగే అవకాశముంది.