Gold Loan EMI : గోల్డ్ లోన్.. ఆర్థిక అత్యవసరాలను తీర్చే బెస్ట్ ఆప్షన్. చాలామంది డబ్బులు అవసరం అయినప్పుడు గోల్డ్‌ను తనఖా పెట్టి లోన్ తీసుకుంటుంటారు. బ్యాంకులు/ఆర్థిక సంస్థలు వాటి పాలసీలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూల్స్‌కు అనుగుణంగా గోల్డ్ విలువలో ఇంచుమించు 75 శాతం దాకా లోన్ ఇస్తుంటాయి. ఈ లోన్ మొత్తంపై నిర్దిష్ట రేటు ప్రకారం వడ్డీని విధిస్తుంటాయి. ఈ వడ్డీని రోజువారీగా లెక్కిస్తుంటారు. గోల్డ్ లోన్ తీసుకున్న వ్యక్తి ప్రతినెలా ఈ వడ్డీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటిదాకా గోల్డ్ లోన్ల మంజూరులో ఈఎంఐ పేమెంట్స్ (రుణ బకాయిల నెలవారీ చెల్లింపులు) పద్ధతి అందుబాటులో లేదు.
Also Read :Mens Day 2024 : కవితను చదివి వినిపించిన మహేశ్ బాబు.. ‘మెన్స్ డే’ ప్రత్యేక పోస్ట్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ (Gold Loan EMI) వల్ల చాలామంది అసలు కట్టడంలో విఫలం అవుతున్నారు. ఈ ఆప్షన్‌లో.. గోల్డ్ లోన్ కాలపరిమితి పూర్తయిన తర్వాత తీసుకున్న లోన్ మొత్తాన్ని ఒకేసారి పే చేయాలి. ఒకవేళ ముందే డబ్బులు రెడీ అయితే.. అసలు, వడ్డీ కలిపి ఇచ్చేసి గోల్డ్‌ను విడిపించుకోవచ్చు. బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ కారణంగా.. అంత పెద్ద లోన్ అమౌంటును ఒకేసారి అరేంజ్ చేసుకునేందుకు చాలామంది మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. చాలామంది కస్టమర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ లోపాన్ని అధిగమించేలా గోల్డ్ లోన్ సంస్థలను సశక్తం చేసే దిశగా ఆర్‌బీఐ అడుగులు వేస్తోంది.
Also Read :Nuclear Weapons : ‘అణ్వాయుధాల’ ఫైల్‌పై పుతిన్ సంతకం.. అందులో ఏముంది ?
గోల్డ్ లోన్‌ను మంజూరు చేసే క్రమంలో బంగారు ఆభరణాల విలువను నిర్ధారించే విషయంలో లోపాలు జరుగుతున్నాయి. ఈ అంశాలను ఆర్‌బీఐ గుర్తించింది. ఎవరైనా గోల్డ్ లోన్‌ను తిరిగి చెల్లించలేకపోతే.. ఆ బంగారాన్ని వేలం వేస్తుంటారు. బంగారం వేలం ప్రక్రియలో అంతగా పారదర్శకత ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం లోన్ అమౌంటును సిద్ధం చేసుకోలేక.. చాలామంది నెలవారీ వడ్డీలు కడుతూ సతమతం అవుతున్నారు. ప్రజల ఈ సమస్యను తీర్చేందుకే గోల్డ్ లోన్ల ఈఎంఐ పద్ధతిని పరిచయం చేయాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో ఉందని ఆర్‌బీఐ ఇటీవల ఓ సర్క్యులర్‌లో ప్రస్తావించింది.